Begin typing your search above and press return to search.

మహేష్ 27 ఏం జరుగుతుంది ?

By:  Tupaki Desk   |   25 Feb 2020 5:30 AM GMT
మహేష్ 27 ఏం జరుగుతుంది ?
X
ప్రస్తుతం మహేష్ బాబు నెక్స్ట్ సినిమా విషయంలో గట్టి చర్చ నడుస్తుంది. అవును ఎక్కడ చూసిన ఇప్పుడు మహేష్ 27 సినిమానే హాట్ టాపిక్. దీనికి రీజన్ మహేష్ వంశీ పైడిపల్లి కథను పక్కన పెట్టి మరో డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడనే వార్త వినిపించడం. అవును తన కెరీర్ లో బెస్ట్ ఇచ్చాడని ఫీలయి వెంటనే తనకోసం మరో స్క్రిప్ట్ రెడీ చేసుకోమని చెప్పాడు ప్రిన్స్.

కట్ చేస్తే సరిలేరు నీకెవ్వరు రిలీజ్ లోపే వంశీ కథ సిద్దం చేసి మహేష్ ని కలిసాడు. అంతా మహేష్ వంశీ పైడిపల్లి సినిమా కన్ఫర్మ్ అంటూ చెప్పుకున్నారు. అయితే వంశీ కంటే ముందే పరశురాం బుజ్జి మహేష్ కి ఓ కథ చెప్పాడు. కానీ పరశురాంని హోల్డ్ లో పెట్టి వంశీ పైడిపల్లి తో నెక్స్ట్ సినిమా చేయడానికి డిసైడ్ అయ్యాడు మహేష్. కానీ ఉన్నట్టుండి మళ్ళీ మహేష్ ప్లాన్ చేంజ్ అయింది. అవును పరశురాంతో తన 27 వ సినిమా చేస్తున్నదంటూ ప్రచారం జరుగుతుంది.

ఇక మహేష్ టీం కూడా 27 సినిమా అప్డేట్ అతి త్వరలో అంటూ సోషల్ మీడియా ద్వారా చెప్పారు. కట్ చేస్తే ఇప్పుడు మహేష్ చిరు సినిమాలో చరణ్ రోల్ చేయబోతున్నాడని మరో వార్త చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. దీంతో అసలు మహేష్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుంది ఇందులో ఏది నిజం అనే డైలమాలో ఫ్యాన్స్ ఉన్నారు. మరి మహేష్ 27 సినిమా ఏంటనేది తెలియాలంటే మహేష్ అనౌన్స్ చేసే వరకూ ఆగాల్సిందే. అప్పుడు కానీ ఓ క్లారిటీ రాదు.