Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: సీతా పాప నాన్న కూచీ.. ఇదిగో ఇదే ప్రూఫ్‌!

By:  Tupaki Desk   |   30 Sep 2020 2:00 PM GMT
ఫోటో స్టోరి: సీతా పాప నాన్న కూచీ.. ఇదిగో ఇదే ప్రూఫ్‌!
X
సూప‌ర్ స్టార్ మహేష్ గారాల ప‌ట్టీ సితార ఘట్టమనేని అల్ల‌రి వేషం గురించి ప‌రిచ‌యం చేయాలా? డాడీతో క‌లిసి సితార అల్ల‌రి అంతా ఇంతా కాదు. ఇంట్లో ఉన్నా షికార్ వెళ్లినా సీతా పాప స‌ర‌దా వేషాల‌తో ఆక‌ట్టుకుంటుంది. ఆ ఫోటోల్ని న‌మ్ర‌త అభిమానుల‌కు షేర్ చేస్తుంటారు.

తాజాగా డాడీతో ఉన్న ఓ అరుదైన ఫోటోని సీతా పాప‌ తన ఇన్ ‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో కొన్ని మనోహరమైన ఛాయాచిత్రాలను.. వీడియో ఫీడ్ ని అభిమానుల కోసం షేర్ చేయ‌డం విశేషం. తన తాజా ఇన్ ‌స్టా పోస్ట్ లో సితార తన తండ్రితో ఒక రేర్ మూవ్ మెంట్ ని ఆస్వాధిస్తోంది. ఈ ఫోటో ఎక్క‌డ‌? అంటే..

ఫ్యామిలీ హాలీడేస్ సమయంలో విమానాశ్రయం లాంజ్ లో ఈ ఫోటో తీసారు. “ఈ విశ్రాంతి స్థలం కంటే గొప్పది ఏమీ లేదు !! హాయిగా నవ్వండి !! నానా మీరు నా బెస్ట్ ” అంటూ సితార ఈ ఫోటోకి వ్యాఖ్య‌ను జోడించ‌డం ఆస‌క్తిక‌రం. సీతా పాప నాన్న కూచీ అనేందుకు ఇంత‌కంటే ఎగ్జాంపుల్ కావాలా?