రష్మికకు పంచ్ వేసిన షాకిచ్చిన మహేశ్

Sat Jan 18 2020 09:31:06 GMT+0530 (IST)

Mahesh Babu Satires on Rashmika

సంక్రాంతి పండుగ వేళ వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న వేళ.. ప్రమోషన్ వర్క్ తో మరింత దూసుకెళ్లేందుకు వీలుగా వరంగల్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. భారీగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హీరో మహేశ్ మాట్లాడారు. దాదాపు ఆరు నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో.. తన రోటీన్ తీరుకు కాస్త భిన్నంగా వ్యవహరించారు మహేశ్.ఎప్పుడూ కూల్ గా ఉండే ఆయన..కాస్తంత ఎమోషన్ గా కనిపించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎప్పుడూ లేని రీతిలో హీరోయిన రష్మిక మందాడకు తనదైన శైలిలో పంచ్ వేయటం అందరిని ఆకర్షించింది. సరిలేరునీకెవ్వరు టీంలో ముఖ్యమైన వారి గురించి ప్రస్తావిస్తూ.. హీరోయిన్ రష్మిక గురించి మాట్లాడారు.

ఆమె స్టేజ్ మీద కనిపించకపోవంతో.. ఎక్కడ ఉన్నావమ్మా రష్మిక ఇలా బయటకు రా అన్న మహేశ్.. ఫంక్షన్లు ఇప్పుడే కాదమ్మా.. ఇంకా చాలా ఫంక్షన్లు ఉన్నాయి. నువ్వు చాలావాటికి రావాలన్నారు. మహేశ్ నోటి నుంచి ఈ వ్యాఖ్యలు ఎందుకు వచ్చాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హీరోయిన్లు సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండటం.. కొందరు హీరోయిన్లు ఈ విషయంలో మహా కరకుగా ఉన్న నేపథ్యంలో వారి మీద వేసే పంచ్ ను.. కాస్త తిప్పి రష్మిక మీద వేశారని చెప్పాలి. ఏమైనా.. తన హీరోయిన్ ను అందరి ముందు పంచ్ వేసిన మహేశ్ మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.