ఫేక్ కలెక్షన్స్: సరిలేరువా.. భరత్ అనే నేనువా?

Tue Jan 21 2020 18:35:26 GMT+0530 (IST)

Mahesh Babu Sarileru Neekevvaru Movie Collections

ఈ సంక్రాంతి సినిమాల జయాపజయాల సంగతి ఎలా ఉందో కానీ ఫేక్ కలెక్షన్స్ పై నానా రచ్చ జరుగుతోంది. ఇందులో ఒకరు తప్పు.. మరొకరు ఒప్పు అని చెప్పడం కాదు కానీ దొందూ దొందే తరహాలో రెచ్చిపోతున్నారు.  ఇక 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ మాత్రం కలెక్షన్స్ విషయంలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ నిజం ఒప్పుకోకుండా.. కిందపడ్డా మాదే పైచేయి అంటూ ఈ ఫేక్ గేమ్ ను తారాస్థాయికి తీసుకుపోతున్నారు.  అయితే అబద్ధం చెప్పిన తర్వాత ఎక్కడో ఒక చోట దొరక్కపోరు కదా.. ఈరోజు అలానే సరిలేరు టీమ్ దొరికిపోయింది.వారు దొరికిపోయారు అనడం కంటే సోషల్ మీడియాలో నెటిజన్లు దొరకబుచ్చుకున్నారు అనడం కరెక్ట్.  విషయంలోకి డైరెక్ట్ గా వెళ్తే..  ఈరోజు ఉదయం 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ తమ సినిమా రూ.200+ కోట్ల గ్రాస్ సాధించింది అంటూ అధికారికంగా పోస్టర్లు రిలీజ్ చేశారు.  సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. అంతటితో ఆగితే ఇరుక్కునేవారు కాదు కానీ మధ్యాహ్నానికి 'మహేష్ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్' అంటూ ఇంకో పోస్టర్ రిలీజ్ చేశారు.  అయితే  ఇందులో నంబర్ ఇవ్వలేదు. నంబర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ సినిమాకు మహేష్ గతంలో బెస్ట్ కలెక్షన్స్ వసూలు చసిన చిత్రం కంటే కలెక్షన్స్ ఎక్కువగా వచ్చి ఉండాలి.  అయితే గతంలో మహేష్ సినిమా 'భరత్ అనే నేను' 50 రోజుల పోస్టర్లో ఏడు వారాల వరల్డ్ వైడ్ గ్రాస్ 232.68 కోట్లు అంటూ ఘనంగా ప్రకటించుకున్నారు.  ఈలెక్కన 'సరిలేరు నీకెవ్వరు' ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు ఈ 30+ కోట్లు వసూలు చేసి ఉండాలి. ఇదెలా సాధ్యం.. అంటూ నెటిజన్లు 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ పై ఫేక్ కలెక్షన్ల ప్రచారం చేస్తున్నారు అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు.

ఒకవేళ సరిలేరు  మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ నిజం అయితే కొరటాల శివ-దానయ్య-మహేష్ బాబుల 'భరత్ అనే నేను' కలెక్షన్లు ఫేక్ అయి ఉండాలి.  రెండిటిలో ఒకటే నిజం.  ఈ కలెక్షన్స్ మాయలో పడి సింపుల్ లాజిక్కులు గాలికి వదిలేస్తున్నారు.  పోస్టర్లలో కాకి లెక్కలు వేసుకునే ముందు.. గతంలో మహేష్ సినిమాలకు వచ్చిన కలెక్షన్లను గమనించుకోకపోతే ఇలానే ఉంటుందని సెటైర్లు పడుతున్నాయి.  గూగుల్ లో ఈ పోస్టర్లు పర్మనెంట్ గా ఉంటాయనే  లాజిక్ మిస్ అయితే ఎలా సార్లూ...???