Begin typing your search above and press return to search.

అందంలో.. సరిలేరు నీకెవ్వరు మహేష్!

By:  Tupaki Desk   |   9 Dec 2019 8:43 AM GMT
అందంలో.. సరిలేరు నీకెవ్వరు మహేష్!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చివరి దశలో ఉన్న ఈ మాస్ ఎంటర్టైనర్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా ప్రారంభమయ్యాయి. సినిమా టీజర్ కు భారీ స్పందన దక్కింది. ప్రతి సోమవారం ఈ సినిమా నుండి ఒక పాటను విడుదల చేస్తామని ఫిలిం మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ సింగిల్ 'మైండ్ బ్లాక్' పోయిన సోమవారం విడుదలై మాస్ ప్రేక్షకులను మెప్పించింది. ఈరోజు సాయంత్రం రెండవ సింగిల్ 'సుర్యుడివో చంద్రుడివో' విడుదల అవుతోంది.

ఇదిలా ఉంటే సెకండ్ సాంగ్ నుండి ఒక పోస్టర్ ను 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ తాజాగా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో మహేష్ బాబు జస్ట్ అలా నిలుచుని చూస్తున్నారు. అంతే. ఒక వైపు గోడ.. మరోవైపు వేలాడుతున్న బంతి పూల మాలలు.. తోరణాలు. గళ్ళ చొక్కా ధరించి ఒక చేతిని పిల్లర్ కు ఆన్చి మరో చేతిని జేబులో స్టైల్ గా పెట్టుకొని మహేష్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఇక మహేష్ ఫేస్ లో ఆ స్మైల్ అదరహో.. చాలా భాషలలో సూపర్ స్టార్లు ఉంటారు కానీ మన తెలుగువారికి మాత్రం కూల్.. హ్యాండ్సమ్ సూపర్ స్టార్ ఉన్నారు. పక్క భాషల వారు కుళ్లుకుని చచ్చేంత అందం. ఈ పోస్టర్లో ఆ అందం అంతా కనిపిస్తోంది.

సిట్యుయేషన్ సాంగ్ గా రానున్న సూర్యుడివో చంద్రుడివో ఒక మెలోడీగా ఉంటుందని.. ఓ అందమైన పల్లెటూరి నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించారని సమచారం. మరి ఈ పాట ఎలా ఉంటుందో తెలియాలంటే సాయంత్రం వరకూ వేచి చూడాలి. అంతా ఓకే కానీ.. మహేష్ అంత అందంగా ఎలా ఉన్నాడబ్బా..?