ప్లాన్ చేస్తే పాన్ ఇండియా సినిమాలు రావు: మహేష్

Thu Jan 16 2020 16:54:03 GMT+0530 (IST)

Mahesh Babu Not Interested on About Pan Indian Movies

ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' ఒకటి.  సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం భారీగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత మహేష్ మాస్ ఎంటర్టైనర్ చెయ్యడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర  సందడి నెలకొంది.  మహేష్ కూడా ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ పట్ల సంతోషంగా ఉన్నారు.రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మహేష్ ను చాలామంది స్టార్ హీరోలు పాన్ ఇండియా(దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యే) సినిమాలు చేస్తున్నారు.. మీకు అలా పాన్ ఇండియా సినిమా చేసే ఆలోచన ఉందా అని ప్రశ్నిస్తే.. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని.. తెలుగు సినిమాలు చేయడం తనకు హ్యాపీ అని.. ఇలానే కంటిన్యూ అవుతానని చెప్పారు.   పాన్ ఇండియా సినిమాలు అది పనిగా ప్లాన్ చేస్తే వర్క్ అవుట్ కావని.. అవి వాటంతట అవే వస్తాయని అన్నారు. ఈలెక్కన ఇతర స్టార్ హీరోల తరహాలో  మహేష్ కు పాన్ ఇండియా సినిమాలు చేసే ఉద్దేశం లేనట్టే.  ఒకవేళ మహేష్ నటించిన సినిమాకు యూనివర్సల్ అప్పీల్ ఉంటే మాత్రం ఇతర భాషల్లో రిలీజ్ చేస్తారన్నమాట.

'సరిలేరు నీకెవ్వరు' తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటిస్తారు.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది మే నుంచి ప్రారంభిస్తారట.  త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.