మహేష్ సర్కారు వారి పాట తర్వాత ఏంటీ?

Thu Nov 26 2020 14:00:26 GMT+0530 (IST)

What is Mahesh Do after Sarkaru Vaari Paata?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఈయన పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాకు సిద్దం అవుతున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను ప్రారంభించబోతున్నారు. సినిమా కేవలం ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామంటూ దర్శకుడు పరశురామ్ అంటున్నాడు. గ్యాప్ లేకుండా చకచక సినిమాను పూర్తి చేసి వెంటనే తదుపరి సినిమాను మహేష్ బాబు మొదలు పెట్టాలని ఆశ పడుతున్నాడు. మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు తదుపరి సినిమాను అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడట.ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఆ సినిమా సమయంలోనే దర్శకుడు అనీల్ కు మహేష్ ఆఫర్ ఇచ్చాడు. తప్పకుండా మా ఇద్దరి కాంబోలో మరో సినిమా వస్తుందని పేర్కొన్నాడు. అనీల్ చాలా స్పీడ్ గా సినిమాలు చేయడంలో దిట్ట. అందుకే వచ్చే ఏడాది వెంటనే సినిమాను చేసి 2022 సంక్రాంతికి విడుదల చేయాలంటే అనీల్ రావిపూడితో అయితేనే కరెక్ట్ అనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఎఫ్3 సినిమా పూర్తి అయిన వెంటనే మహేష్ బాబు ను డైరెక్ట్ చేసేందుకు అనీల్ సిద్దంగా ఉన్నాడు. అందుకు సంబంధించిన కథ కూడా ఓకే అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. మరోసారి పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని ఇప్పటి నుండి మహేష్ బాబు అభిమానులు అంచనాలు పెంచేసుకుంటున్నారు.