'మహర్షి' లో ఇలాగేనా?

Tue Jan 22 2019 19:18:04 GMT+0530 (IST)

మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న 'మహర్షి' చిత్రంలో చాలా ప్రత్యేకంగా కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన రెండు మూడు స్టిల్స్ అయితే వచ్చాయి కాని ఫుల్ క్లారిటీగా మహేష్ బాబు ఈ చిత్రంలో ఎలా కనిపించబోతున్నాడనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. మహర్షి చిత్రంలో మహేష్ బాబు మొదటి సారి గడ్డం మరియు మీసాలతో కనిపించబోతున్నాడు. అయితే అలా సినిమా మొత్తం కాకుండా కొన్ని సీన్స్ మాత్రమే కనిపిస్తాడట. ఎక్కువ శాతం ఎప్పటిలాగే గడ్డం మీసాలు లేకుండా డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపిస్తాడని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.మహష్ లుక్ పై గత కొన్ని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా నమ్రత బర్త్ డే సందర్బంగా సోషల్ మీడియాలో ఈ ఫొటో తెగ హల్ చల్ చేస్తోంది. మహేష్ బాబు తన భార్య నమ్రతకు బర్త్ డే సందర్బంగా తీసుకున్న ఈ ఫొటోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. మహర్షి చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇక తాజాగా మహేష్ తీసుకున్న స్టిల్ ఇది అవ్వడంతో మహర్షిలో మహేష్ ఇలాగే కనిపించబోతున్నాడంటూ అభిమానులు అనుకుంటున్నారు.

మహేష్ బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రం అవ్వడంతో 'మహర్షి' విషయంలో చాలా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ ఎత్తున ఈ చిత్రంను వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. ఫారిన్ బిజినెస్ మన్ గానే కాకుండా పల్లెటూరులో స్నేహితుడి కోసం వ్యవసాయం చేసే రైతుగా కూడా మహేష్ బాబు ఈ చిత్రంలో కనిపిస్తాడని తెలుస్తోంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.