మైత్రి వారికి మహేష్ అంటే అంత ఇది ఎందుకో..?

Sun May 15 2022 14:00:00 GMT+0530 (IST)

Mahesh Babu Mythri Movie Makers

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే విడుదల అయ్యింది. సినిమాకు జనాల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. మొదట రివ్యూలు సినిమా పర్వాలేదు అన్నట్లుగా వచ్చాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో సినిమా డిజాస్టర్ అంటూ ప్రచారం జరిగింది. ఏకంగా సర్కారు వారి పాట డిజాస్టర్ అంటూ హ్యాష్ ట్యాగ్ వైరల్ అయ్యింది.అంతటి భారీ నెగటివ్ ప్రచారం జరుగుతున్న సమయంలో మైత్రి మూవీస్ వారు చాలా బాగా మ్యానేజ్ చేయగలిగారు. సోషల్ మీడియాలో బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట హ్యాష్ ట్యాగ్ తో జనాల దృష్టిని ఆకర్షించడంతో పాటు వెంటనే సినిమా విడుదల అయిన రోజే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు మరియు దర్శకుడు పరశురామ్ మీడియా ముందుకు వచ్చి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చారు.

సర్కారు వారి పాట సినిమాకు సోషల్ మీడియాలో మరియు ఇతర మీడియాల్లో నెగటివ్ ప్రచారం జరుగుతున్న సమయంలో అది హైలైట్ అవ్వకుండా మైత్రి మూవీ మేకర్స్ వారు చాలా ప్రయత్నాలు చేసి ఎక్కువగా నెగిటివిటీ ప్రచారం కాకుండా చూసింది. వారు ఎంత చేసినా కూడా జనాల్లో ఒక అభిప్రాయం మాత్రం ఏర్పడిపోయింది. అయినా కూడా మైత్రి వారు మాత్రం చాలా బలంగా సర్కారు వారి పాట సినిమాకు పాజిటివ్ గా ప్రచారం చేయడం జరిగింది.

మైత్రి మూవీ మేకర్స్ వారు సర్కారు వారి పాట సినిమాను డిఫైన్ చేసుకున్న విధానం పై అందరు చర్చించుకుంటున్న సమయంలో మరి కొందరు మాత్రం ఆ విషయాన్ని బూతద్దంలో పెట్టి విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఒక స్టార్ హీరో సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన సమయంలో ఆ సినిమా డిజాస్టర్ అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది.

ఆ సమయంలో మైత్రి మూవీ మేకర్స్ వారు డిఫైన్ చేసేందుకు ప్రయత్నించలేదు. ఆ విషయాన్ని ఇప్పుడు కొందరు సోషల్ మీడియా ద్వారా ప్రస్తావిస్తూ మైత్రి మూవీ మేకర్స్ వారికి కేవలం మహేష్ బాబు అంటే ప్రత్యేకమైన అభిమానం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సర్కారు వారి పాట సినిమా కోసం నిర్మాతలు చాలా ఖర్చు చేసి మరీ పాజిటివ్ పబ్లిసిటీ చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇతర హీరోల సినిమాల విషయంలో అంత పట్టుదల చూపించని మైత్రి మూవీస్ వారు మహేష్ బాబు సినిమా అంటే ఎందుకు అంత ప్రత్యేక శ్రద్దను కనబర్చుతున్నారు అంటూ కొందరు సోషల్ మీడియా వారు.. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిందకు మైత్రి మూవీస్ వారి నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.