ఊరిస్తున్న 'మహర్షి' అప్ డేట్

Mon Apr 22 2019 17:00:11 GMT+0530 (IST)

Mahesh Babu Maharshi Movie Pre Release event

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం 'మహర్షి' విడుదలకు సిద్దం అయ్యింది. ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల మే 9న విడుదలకు రెడీ అయ్యింది. షూటింగ్ కు ఇప్పటికే గుమ్మడి కాయ కొట్టేసిన చిత్ర యూనిట్ సభ్యులు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా బిజీ అయ్యారు. మహేష్ బాబు 25వ చిత్రం అవ్వడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి.ఇక ఈ చిత్రం 100 కోట్ల బడ్జెట్ అంటూ వార్తలు వస్తున్న కారణంగా కూడా ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగి పోతూనే ఉంది. అందుకే ఈ చిత్రంకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా కూడా వైరల్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మే 1 లేదా 4వ తారీకుల్లో చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

25వ చిత్రం అవ్వడం వల్ల అభిమానులు పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చే అవకాశం ఉంది. భారీ స్థాయిలో అభిమానుల సమక్షంలో సినిమా ప్రీ రిలీజ్ వేడుక చేస్తే బాగుంటుందనే అభిప్రాయంలో దిల్ రాజు ఉన్నాడట. అందుకు తగ్గ తేదీ మరియు వెన్యూ ఎంపిక ఏర్పాట్లలో తలమునకలై ఉన్నాడు. ఈ చిత్రంను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు - అశ్వినీదత్ - పీవీపీలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఈ చిత్రంలో మహేష్ కు జోడీగా నటించగా అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందనే నమ్మకంతో మహేష్ ఫ్యాన్స్ ఉన్నారు. మరి రికార్డులను ఏ స్థాయిలో బద్దలు కొడుతుందో చూడాలి.