Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్‌ కూడా... బాలయ్య లిస్ట్‌ చాలా పెద్దదే

By:  Tupaki Desk   |   1 Dec 2021 12:30 PM GMT
సూపర్ స్టార్‌ కూడా... బాలయ్య లిస్ట్‌ చాలా పెద్దదే
X
బాలకృష్ణ మొదటి సారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్‌ మూడవ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కు సిద్దం అయ్యింది. రెండు రోజుల్లో ఆహా లో అన్ స్టాపబుల్‌ అంటూ బ్రహ్మానందం మరియు అనీల్ రావిపూడితో కలిసి బాలయ్య సందడి చేయబోతున్నాడు. బాలకృష్ణ మొదటి ఎపిసోడ్‌ లో మోహన్ బాబుతో టాక్ షో కొనసాగించాడు. తర్వాత నాని వచ్చాడు. నాని ఎపిసోడ్‌ తర్వాత మూడు వారాల గ్యాప్ వచ్చింది. బాలకృష్ణ ఆపరేషన్ కారణంగా బ్రేక్ తీసుకున్నాడు. మూడవ ఎపిసోడ్‌ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. చేతికి కట్టుతోనే అన్ స్టాపబుల్‌ షూట్‌ లో పాల్గొన్నాడు. ఒక వైపు అఖండ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు మరియు మరో వైపు అన్‌ స్టాపబుల్‌ షూటింగ్‌ తో బాలయ్య బిజీగా ఉన్నాడు.

బాలకృష్ణ అన్ స్టాపబుల్‌ ఇక ముందు బ్రేక్ లేకుండా కంటిన్యూస్ గా వారం వారం ప్రేక్షకుల ముందుకు కొత్త గెస్ట్‌ తో రాబోతుంది. టాలీవుడ్‌ కు చెందిన ప్రముఖులతో ఈ షో సాగబోతుందట. ఇప్పటికే వచ్చిన స్టార్స్ కాకుండా ముందు ముందు పెద్ద పెద్ద స్టార్స్ వస్తారని అంటున్నారు. స్టార్‌ డైరెక్టర్స్ తో పాటు స్టార్‌ హీరోయిన్స్ ఇంకా పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సూపర్ స్టార్‌ మహేష్ బాబు కూడా అన్‌ స్టాపబుల్‌ టాక్ షో లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య తో ఉన్న సన్నిహిత సంబంధాలు మరియు ఆహా టీమ్‌ తో ఆయనకు ఉన్న అనుబంధం కారణంగా అన్ స్టాపబుల్‌ షో కు హాజరు అయ్యేందుకు గాను మహేష్‌ బాబు ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి.

ఒక వేళ మహేష్ బాబు కనుక అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్‌ లో కనిపిస్తే రచ్చ రచ్చే అనడంలో సందేహం లేదు. రాడు రాడు అనుకుంటూ ఉండగా ఎన్టీఆర్‌ ఎవరు మీలో కోటీశ్వరులు షో లో సందడి చేశాడు. ఆ ఎపిసోడ్ ను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బుల్లి తెరపై ఎన్టీఆర్‌ ఎవరు మీలో కోటీశ్వరులు మహేష్‌ బాబు స్పెషల్‌ ఎపిసోడ్‌ రికార్డు ను సృష్టించడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. ఇక ఓటీటీ లో బాలయ్య తో మహేష్‌ బాబు ఎపిసోడ్‌ పడితే ఆహా ఓటీటీ రేంజ్ ఓ రేంజ్ లో పెరగడం ఖాయం. ఇప్పటికే తెలుగు వారికి ఆహా చాలా చేరువ అయ్యింది. ఇలాంటి సమయంలో మహేష్ బాబు వంటి స్టార్‌ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ అయితే ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మహేష్‌ బాబు మాత్రమే కాకుండా చిరంజీవి ఇంకా ప్రముఖ స్టార్స్ తో కూడా ఆహా టీమ్‌ చర్చలు జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. పుష్ప విడుదల సమయంకు అల్లు అర్జున్‌ కూడా అన్‌ స్టాపబుల్ లో సందడి చేసే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. మొత్తానికి అన్‌ స్టాపబుల్‌ జాబిత చాలా పెద్దగానే కనిపిస్తుంది. అభిమానులు ఎంత మందిని బాలయ్యతో చూస్తారో కాలమే నిర్ణయిస్తుంది.