43లో వయసును దాచేస్తున్నస్టార్ హీరో?

Thu Aug 09 2018 22:55:02 GMT+0530 (IST)

`మహర్షి` టీజర్ లాంచ్ అయ్యాక రెండు సందేహాలు మహేష్ అభిమానుల్ని పీక్కు తిన్నాయి. ఈ వయసులో ఆయన కాలేజ్ స్టూడెంట్ ఏంటి? సరే! వయసు దాచేసి స్టూడెంట్ అయ్యాడనుకుందాం. అసలు అంత హ్యాండ్సమ్ లుక్ ని ఎలా కాపాడుకోగలుగుతున్నాడు? 43లోనూ 23 ఎలా చూపిస్తున్నాడు? అంటూ అభిమానులు ఒకటే మదనపడిపోయారు. 20కే 40 వయసు ఉన్నవాళ్లలా కనిపిస్తుంటే.. ఈయనేమో నిన్నగాక మొన్ననే నూనూగు మీసాలు మొలిచి - లైట్ గా పెరిగిన గడ్డంతో.. జూనియర్ కాలేజ్ లో జస్ట్ అడ్మిషన్ తీసుకున్న విద్యార్థిలా ఎలా కనిపిస్తున్నాడు? అన్నది పెద్ద ఫజిల్ అయిపోయింది.అసలు ఆ గుట్టు విప్పుతాడా? అంటే మహేష్ అసలు ఆ సీక్రెట్ ఏంటో చెప్పనే చెప్పడు. ఒకవేళ మహేష్ అందం వెనక రహస్యాన్ని తెలుసుకున్నా.. అతడిలా చేయడం మాత్రం కష్టం. ఎందుకంటే ఆ గ్లామర్ కి కారణం టైముకి తిని - టైముకి డ్యూటీ చేసి - అంతే టంచనుగా సమయానికి నిద్రించడమేనట. సూపర్ స్టార్ కృష్ణ నుంచి వచ్చిన క్రమశిక్షణ - అలవాట్లు ఇవి. ఇలా చేయమని మమ్మీ డాడీ చెవిన ఇల్లు కట్టుకుని పోరినా ఒక చెవి నుంచి విని రెండో చెవి నుంచి వదిలేస్తాం. మనలో ఎవరూ చేయలేం. అందుకే మహేష్ కు మనకు వయసులో ఇంత తేడా తెలిసిపోతోంది.

అదంతా సరే.. అతడి గ్లామర్ వెనక వేరొక కారణం కూడా ఆసక్తికరం. మహేష్ డ్యూటీ అయిపోగానే ఇంటికొస్తే ఫ్యామిలీ పిల్లలతో జాలీగా గడిపేస్తాడు. ఇదిగో నిన్నటికి నిన్న బర్త్ డే టూర్ అంటూ నమ్రత - సితార - గౌతమ్ లతో గోవాకు షార్ట్ ట్రిప్ వేసేశాడు. సందు దొరికితే చాలు ఫ్యామిలీతో ఎటో చెక్కేస్తుంటాడు. కమల్‌హాసన్ వయసు 63. అంతకంటే మహేష్ వయసు 20 తక్కువ అంతే. ఆ 43లోంచి మరో 20 మైనస్ చేసేశాడు. దటీజ్ మహేష్ అన్నమాట!