Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ హోమ్ జిమ్ ఎప్పుడైనా చూశారా...!

By:  Tupaki Desk   |   15 July 2020 5:31 PM GMT
సూపర్ స్టార్ హోమ్ జిమ్ ఎప్పుడైనా చూశారా...!
X
సూపర్‌ స్టార్ మహేష్ బాబు అందం గురించి బాడీ ఫిట్‌‌ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ కి నాలుగు పదుల వయస్సు దాటినా ఇంకా ఇరవై ఏళ్ల కుర్రాడిలా హ్యాండ్సమ్ గా కనిపిస్తుంటారు. ఏజ్ అనేది మహేష్ బాబుకి జస్ట్ నంబర్ మాత్రమే అంటుంటారు సినీ అభిమానులు. అందుకే మహేష్ కి దేశవ్యాప్తంగా అంతలా ఫాలోయింగ్ ఉంది. ఇక మహేష్ అందానికి.. ఫిట్‌‌ నెస్‌‌ కు ఫిదా అయిపోయి లేడీ ఫ్యాన్స్‌‌ ఎందరో ఉన్నారు. ఈ మధ్య ఆయన పోస్ట్ చేస్తున్న ఫోటోలలో మహేష్ లుక్ చూస్తే టీనేజర్ లా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. సూపర్ స్టార్ లుక్స్ కి టాలీవుడ్ లోనే కాదు ఇండియా మొత్తంలో కూడా ఎవరూ పోటీ పడలేరు అన్నది అందరికీ తెలిసిన విషయమే. రోజురోజుకు తన గ్లామర్ ను పెంచుకుంటూ వెలుతున్న మహేష్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని అందరికీ ఆశక్తి గానే ఉంటుంది. అయితే మహేష్ ఇప్పటికి అదే ఫిజిక్ మెయిన్టైన్ చేయడానికి అతను చేసే జిమ్ వర్కౌట్స్ కారణమని తెలుస్తోంది.

కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన ఇంటికే పరిమితమైన మహేష్ బాబు భార్యా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. అదే సమయంలో బయటకి వెళ్లేది కూడా లేకపోవడంతో పుస్తకాలు చదువుతూ.. సినిమాలు వెబ్ సిరీస్ లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ డైలీ ఏదొక పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు మహేష్. ఈ క్రమంలో కరోనా అవేర్నెస్ వీడియోలు పోస్ట్ చేస్తూ.. మరోవైపు ఫ్యామిలీ ఫోటోలను పంచుకుంటున్నారు. మహేష్ సతీమణి నమ్రత కూడా మహేష్ కి సంబంధించిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మహేష్ పర్సనల్ జిమ్ విశేషాలు షేర్ చేశారు. తన భర్త ఫిట్నెస్ సీక్రెట్ ఇదే అంటూ మహేష్ ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్న విశాలమైన జిమ్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. హస్టిల్ హార్డ్.. ఫీల్ ది థండర్ అంటూ నమ్రత షేర్ చేసిన హోమ్ జిమ్ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.