Begin typing your search above and press return to search.

నా సూపర్‌ స్టార్‌ హోదా ఆయన వల్లే

By:  Tupaki Desk   |   10 Oct 2019 4:13 AM GMT
నా సూపర్‌ స్టార్‌ హోదా ఆయన వల్లే
X
టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఇటీవల ఈయన ప్రముఖ మ్యాగజైన్‌ వోగ్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. వోగ్‌ కోసం ఫొటో షూట్‌ లో కూడా మహేష్‌ బాబు పాల్గొన్నారు. ప్రస్తుతం సౌత్‌ లో అత్యంత ప్రముఖమైన హీరోగా గుర్తింపు దక్కించుకున్న మహేష్‌ బాబును వోగ్‌ మ్యాగజైన్‌ ఇంటర్వ్యూ చేసింది. బాలీవుడ్‌ తారలపై మాత్రమే ఎక్కువ శ్రద్ద చూపే వోగ్‌ ఈసారి హీరోయిన్‌ నయనతారను మరియు హీరో మహేష్‌ బాబును ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మహేష్‌ బాబు వోగ్‌ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.

కెరీర్‌ లో మీరు సూపర్‌ స్టార్‌ గా ఎదగడానికి గల కారణాలు ఏంటని మీరు భావిస్తున్నారని ప్రశ్నించిన సందర్బంగా మహేష్‌ బాబు సమాధానంగా తన తండ్రి వల్లే సూపర్‌ స్టార్‌ హోదా దక్కిందని భావిస్తానంటూ పేర్కొన్నాడు. చిన్నప్పుడు వేసవి సెలవుల్లో నన్ను సినిమాల్లో బాల నటుడిగా నటింపజేసిన నాన్న గారు నాకు సినిమాలపై ఆసక్తి కలిగించేలా చేశారు. ఆయన్ను చూస్తూ.. ఆయన్ను అనుసరిస్తూ నేను సినిమాలు చేశానని ఆ కారణంగానే సూపర్‌ స్టార్‌ స్థాయికి వచ్చానంటూ చెప్పుకొచ్చాడు.

నా ఈ కెరీర్‌ కు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కూడా నాన్న కృష్ణ గారు హెల్ప్‌ అయ్యారని మహేష్‌ బాబు పేర్కొన్నాడు. ఆయన వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానంటూ నిరాడంబరంగా వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం మహేష్‌ బాబు ఏ సినిమా చేసినా కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మహర్షి చిత్రం మహేష్‌ బాబు కెరీర్‌ లో 25వ చిత్రం. ఆ సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. ప్రస్తుతం తన 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు ను అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. దాంతో మరో బ్లాక్‌ బస్టర్‌ ను దక్కించుకుంటాననే నమ్మకంతో మహేష్‌ బాబు ఉన్నాడు. రష్మిక హీరోయిన్‌ గా నటిస్తున్న ఆ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో కనిపించబోతుంది.