KGF స్టార్ లా మహేష్ డాన్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారా?

Mon Jan 25 2021 12:20:26 GMT+0530 (IST)

Mahesh Babu Fans Want Mahesh Babu As Don

బిగ్ బి అమితాబ్ బచ్చన్.. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్.. సూపర్ స్టార్ షారూక్ ఖాన్.. కింగ్ నాగార్జున.. డాన్ పాత్రల స్పెషలిస్టులుగా తమ అభిమానుల్ని మెప్పించారు. ఇండియన్ సినిమా హిస్టరీలో చాలామంది డాన్ పాత్రలు పోషించినా కానీ కొందరు స్టార్లు మాత్రం అందుకు సాహసించలేదు.కేజీఎఫ్ ఫ్రాంఛైజీతో ఒక యంగ్ హీరో ఆ ఫీట్ సాధించడం అప్పట్లో సంచలనమే అయ్యింది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. యష్ తనకంటే సీనియర్లు తనకంటే జూనియర్లు అయిన హీరోలందరిలో డాన్ పాత్రతో స్ఫూర్తి నింపారని చెప్పాలి.

ఇక డార్లింగ్ ప్రభాస్ సన్నివేశం వేరు. అతడు ఇప్పటికే బిల్లా.. రెబల్ లాంటి చిత్రాల్లో డాన్ గా నటించాడు. డాన్ అంటే ప్రభాస్ అనే రేంజులో నటించి సత్తా చాటాడు. ఇప్పుడు కేజీఎఫ్ డైరెక్టర్ తో సలార్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో డాన్ గా నటించనున్నాడు. ఆ క్రమంలోనే టాలీవుడ్ లో ఇతర స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరో అలా నటిస్తే చూడాలని ఆశపడుతున్నారు.

ముఖ్యంగా మహేష్ అభిమానుల్లో ఈ ఫీవర్ మరీ ఎక్కువగా ఉంది. తమ ఫేవరెట్ సూపర్ స్టార్ కి వారి పాన్-ఇండియన్ బ్లాక్ బస్టర్స్ కావాలన్నది అభిమానుల అభిమతం. మహేష్ కూడా ప్రశాంత్ నీల్ తో కలిసి ఒక డాన్ మూవీలో నటించాలని కోరుకుంటున్నారు. KGF యష్ లా భారీ గ్యాంగ్ స్టర్ పాత్ర ప్రతి అభిమాని కల. కానీ అది నెరవేరుతుందా? అంటే ఇప్పట్లో సాధ్యం కాదనే అర్థమవుతోంది.

మహేష్ ఇదివరకూ పోకిరి లో అండర్ కవర్ కాప్ పాత్రలో నటించారు. ఆ పాత్రలో డాన్ ఎలివేషన్ ఉంది. బిజినెస్ మ్యాన్ వంటి మాస్ సినిమాలో డాన్ గా నటించాడు. మాఫియాని పెంచి పోషించే స్మార్ట్ డాన్ గా అదరగొట్టాడు. కానీ తన పాత్రకు లవర్ బోయ్ షేడ్ చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ ఆడియెన్ తనకు ఉన్నారు కాబట్టి..  తనకు కొన్ని పరిమితులు ఉన్నాయని కూడా మహేష్ భావిస్తాడు. అందువల్ల అతడు డాన్ తరహా పాత్రల్ని ఎంచుకోలేదా? అన్న సందేహం అభిమానులకు ఉంది.

ఏదేమైనా సూపర్ స్టార్ కి తన పరిమితులు ఏమిటన్నది స్పష్ఠంగా తెలుసు. కొన్ని పాత్రలు తనకు సరిపోవు అని ఇతరులకన్నా బాగా తనకే తెలుసు. ఇతరులకు సరిపోని కొన్ని టైలర్ మేడ్ పాత్రలకు తాను బాగా సరిపోతాడన్నది తెలిసినవాడు. అందువల్లనే మహేష్ తన కెరీర్ ప్రారంభం నుండే ఇలాంటి గ్యాంగ్ స్టర్ పాత్రలను దూరంగా ఉన్నారు. కానీ ప్రస్తుత సన్నివేశంలో అతడు కూడా రూల్ ని బ్రేక్ చేయాల్సిన సన్నివేశం కనిపిస్తోంది.

ఇప్పటికే రేస్ లో బన్ని.. చరణ్.. లాంటి వాళ్లు కూడా పాన్ ఇండియా అప్పీల్ కోసం భారీ మాస్ యాక్షన్ సినిమాల్ని ఎంపిక చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకే ఇప్పుడు మహేష్ కూడా కేజీఎఫ్ తరహా బారీ మాఫియా యాక్షన్ సినిమాలు చేయాల్సి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరి మహేష్ ఛాయిస్ ఎలా ఉంది? అన్నది కాస్త వేచి చూస్తే కానీ చెప్పలేం.