Begin typing your search above and press return to search.

ట్విట్టర్ లో హంగామా చేసే ఫ్యాన్స్..అదే రేంజ్ లో సినిమాలు చూడరు ఎందుకో..!

By:  Tupaki Desk   |   9 Aug 2020 5:30 AM GMT
ట్విట్టర్ లో హంగామా చేసే ఫ్యాన్స్..అదే రేంజ్ లో సినిమాలు చూడరు ఎందుకో..!
X
హీరోల బర్త్ డే వచ్చిందంటే వారి ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు. పెద్ద పెద్ద కటౌట్లు.. బ్యానర్లు.. ప్లెక్సీలు.. కేక్ కట్టింగ్ లు అంటూ హడావిడి బాగానే ఉంటుంది. తమ ఫేవరెట్ హీరో ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని అభిమానులు హీరోల కటౌట్లు ముందు బర్త్ డే వేడుకలు జరుపుతూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ట్రెండ్ మారింది. ఇప్పుడు తమ ఫేవరేట్ హీరో ఫోటోలను అందరూ కామన్ డీపీలుగా పెట్టుకొని సెలెబ్రేట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేడుకగా హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. మా హీరో సినిమా ఇంత కలెక్ట్ చేసింది.. మీ హీరో రికార్డ్స్ ని బ్రేక్ చేసింది అని ఇంతకముందు ఫ్యాన్ వార్స్ ఎలా జరిగేవో.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మా హీరో బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ఇన్ని మిలియన్ ట్వీట్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేసింది.. మీరు మా రికార్డ్స్ బ్రేక్ చేయగలరా అని ఛాలెంజ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా వారి రికార్డ్స్ బీట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య పోటీ వల్ల హీరోల సినిమాల మీద ప్రభావం చూపి నిర్మాతలు నష్టపోతున్నారని తెలుస్తోంది.

కాగా నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బర్త్ డే విషెస్ మరియు మహేష్ బాబు కామన్ డీపీని సోషల్ మీడియాలో వైరల్ చేయడమే కాకుండా నేషనల్ వైడ్ ట్రెండ్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేసారు. ఈ క్రమంలో ట్విట్టర్ లో #HBDMaheshBabu హ్యాష్ ట్యాగ్ తో వరల్డ్ వైడ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. దీనికి తగ్గట్టే సూపర్ స్టార్ డిజిటల్ టీమ్ కూడా ఫాన్స్ లో వేడి తగ్గకుండా అన్ని మిలియన్ వ్యూస్ అంటూ ఎప్పటికప్పుడు పోస్టర్స్ రిలీజ్ చేస్తోంది. ఇలా ఏదొక రికార్డ్ క్రియేట్ చేసి పక్క స్టార్ హీరో ఫ్యాన్స్ ని టీజ్ చేస్తే.. వారు తమ హీరో బర్త్ డే కి ఈ రికార్డు ని బ్రేక్ చేయడానికి ఏవో పనులు చేస్తుంటారు. ఇలా అది చివరికి ఫ్యాన్స్ వార్ గా మారి హీరోలతో సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. ఉదాహరణకి సంక్రాతి బాక్సాఫీస్ వార్ లో మహేష్ మరియు అల్లు అర్జున్ సినిమాలు ఎంత హడావిడి చేశాయో తెలిసిందే. మా హీరో సంక్రాతి విన్నర్ అంటే.. మా హీరో సంక్రాతి మొగుడు అంటూ పోటాపోటీగా పోస్టర్స్ రిలీజ్ చేసుకున్నారు. దీని వల్ల మహేష్ సినిమా కలెక్షన్స్ విషయంలో కాస్త వెనకబడిందని.. ప్రొడ్యూసర్స్ కి ప్రాఫిట్స్ లేవని టాక్ వచ్చింది. ఇది కేవలం ఫాన్స్ అతి ఉత్సహం వల్లే జరిగింది అని ఫిలిం సర్కిల్స్ లో అనుకున్నారు. మరి ట్విట్టర్ లో ఈ రేంజ్ లో హంగామా చేసే ఫ్యాన్స్.. అంతే రేంజ్ లో సినిమాలు చూడరు ఎందుకో..!