పదేళ్ల తర్వాత మహేష్ మూవీ హిందీలో రీమేక్

Mon Aug 10 2020 05:00:01 GMT+0530 (IST)

Mahesh Babu Dookudu Remake in Bollywood

ఈమద్య కాలంలో సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాలు హిందీలో వరుసగా రీమేక్ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని రీమేక్ అయ్యి సూపర్ హిట్ అవ్వగా మరికొన్ని మేకింగ్ దశలో ఉన్నాయి. రీమేక్ జాబితాలో పదుల సంఖ్యలో సినిమాలు పెరుగుతున్నాయి. పాత సినిమాలను కూడా ఇప్పుడు రీమేక్ చేసేందుకు బాలీవుడ్ మేకర్స్ ఆసక్తిగా ఉన్నారు. మహేష్ బాబు దాదాపు పదేళ్ల క్రితం నటించిన ‘దూకుడు’ చిత్రంను ఇప్పుడు రీమేక్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఎంటర్ టైనర్ ను హిందీలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ రీమేక్ చేయబోతుంది. ఇప్పటికే రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేయడంతో పాటు ప్రస్తుతం స్క్రిప్ట్ ను రెడీ చేయిస్తున్నట్లుగా బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ రీమేక్ లో సల్మాన్ లేదా అజయ్ దేవగన్ ను నటింపజేసేందుకు ఈరోస్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. దూకుడు సినిమా సబ్జెక్ట్ యూనివర్శిల్ గా ఉంటుంది. ఎక్కడైనా ఎంటర్ టైన్‌మెంట్ చేస్తుంది. కనుక బాలీవుడ్ ప్రేక్షకులను ఇప్పుడు దూకుడు హిందీ వర్షన్ తో ఎంటర్ టైన్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట.