Begin typing your search above and press return to search.

సూపర్ హిట్లిచ్చిన సూపర్ ప్రొడ్యూసర్ కి మహేష్ బర్త్ డే విషెస్

By:  Tupaki Desk   |   19 Oct 2020 10:50 AM GMT
సూపర్ హిట్లిచ్చిన  సూపర్ ప్రొడ్యూసర్ కి మహేష్ బర్త్ డే విషెస్
X
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత అనిల్ సుంకర ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. దూకుడు, లెజెండ్, 1 నేనొక్కడినే, ఆగడు, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, నమో వెంకటేశ, అహనా పెళ్ళంటా తదితర చిత్రాలను నిర్మించి గుర్తింపు పొందాడు. ఇవాళ అనిల్ సుంకర జన్మదినం కాగా.. ఆయనకు ప్రత్యేకమైన వ్యక్తి, సన్నిహితుడైన సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

'నా సూపర్ నిర్మాత అనిల్ సుంకర కు జన్మదిన శుభాకాంక్షలు. నేను షూటింగ్ లో ఉండేటప్పుడు నన్నెంతో సౌకర్యవంతంగా ఉంచే వ్యక్తి అనిల్ సుంకర. ఆయన ఎప్పుడూ సరదాగా ఉంటాడు. అంత పని ఒత్తిడిలోనూ అలా ఉండడం మామూలు విషయం కాదు. మీరు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాను' అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. మహేష్ బాబుకి అనిల్ సుంకర కొన్నేళ్లుగా సన్నిహితులుగా మెలుగుతున్నారు. మహేష్ ఒకరికి ఒక సినిమా చేయడం అంటేనే మామూలు విషయం కాదు. అలాంటిది ఆయన అనిల్ సుంకర తో దూకుడు, వన్, ఆగడు వంటి మూడు సినిమాలు చేశాడు. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో బ్యాంక్ కు సంబంధించి ఓ భారీ సెట్ వేశారట. కరోనా పరిస్థితులు కాస్త సద్దుమణిగితే మహేష్ తిరిగి షూటింగ్ లో పాల్గొన్ననున్నారు.