Begin typing your search above and press return to search.

డాన్ కొడుకు గా మహేష్ బాబు?

By:  Tupaki Desk   |   4 May 2021 1:30 PM GMT
డాన్ కొడుకు గా మహేష్ బాబు?
X
మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ రెడీ అవబోతుందనే విషయం తెలిసిందే. ‘అతడు’ ‘ఖలేజా’ వంటి ఫ్యాన్స్ కలకాలం గుర్తు పెట్టుకునే సినిమాల చేసిన తర్వాత వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ పై మంచి అంచనాలే ఉన్నాయి. దాంతో ఈ సినిమాలో మహేష్ ఏ తరహా పాత్ర చేయబోతున్నాడు. కథేంటి అనే విషయాలు మీడియాలో డిస్కషన్ గా మారాయి. ఇప్పటికే పార్ధు అనే టైటిల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పుడు ఈ సినిమా గురించి మరో అప్డేట్ బయిటకు వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు ఓ డాన్ కొడుకుగా కనిపించబోతున్నారట. అలాగే ఆ డాన్ పాత్రను అనీల్ కపూర్ చేయబోతున్నారని సమాచారం. ఇది తండ్రి, కొడుకుల మధ్య జరిగే యుద్దం అని అంటున్నారు. అప్పట్లో కృష్ణ,నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన వారసుడు ని గుర్తు చేస్తుందని అంటున్నారు. మహేష్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా కనపడతాడని చెప్తున్నారు.

మునుపెన్నడూ చూడని విధంగా మహేష్‌బాబు పాత్ర స్టెలిష్‌గా డిజైన్ చేసారట. త్రివిక్రమ్ దర్శకత్వంలో చాలా రోజుల తర్వాత చేస్తూండటంతో మహేష్‌ ఎంతో ఉత్సాహంగా ఉన్నారని చెబుతున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు వినికిడి. అందులో ఒక హీరోయిన్ గా కియారా అద్వానీను,మరొక హీరోయిన్ గా పూజ హెగ్డే ని తీసుకోవాలనుకుంటున్నారట.సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ సినిమా మే 31న పూజా కార్యక్రమాలతో లాంచనంగా స్టార్ట్ అవుతుంది.