Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : మహేష్‌ గౌతమ్‌ అన్న తమ్ముడు

By:  Tupaki Desk   |   25 Nov 2020 5:30 AM GMT
ఫొటోటాక్‌ : మహేష్‌ గౌతమ్‌ అన్న తమ్ముడు
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు వయసు పెరుగుతున్నా కూడా ఆయన ఛార్మింగ్‌ మాత్రం తగ్గడం లేదు. ఆయన రోజు రోజుకు యంగ్‌ గా కనిపిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు పెద్ద వారు అవుతున్న ఈ సమయంలో వారికి అన్నయ్యగా మహేష్‌ మారుతున్నాడు అనిపిస్తుంది. పిల్లలతో మహేష్‌ ఎప్పుడు సరదగా గడుపుతూ ఉండే మహేష్ వారికి తండ్రిగా కాకుండా ఫ్రెండ్‌ గా అన్నగా ఉంటాడు అంటూ ఫొటోలను చూస్తే అనిపిస్తుంది.

సితారతో గౌతమ్‌ ఎలా అయితే సరదాగా ఆడుతూ ఆటపట్టిస్తూ ఉంటాడో అలాగే మహేష్‌ బాబు కూడా కూతురు సితారతో ఎక్కువగా చాలా జోవియల్‌ గా ఆడుకుంటూ ఉండటం మనం సోషల్‌ మీడియా పోస్ట్‌ ల్లో చూడవచ్చు. ఎంతో మంది ప్రముఖులు సోషల్‌ మీడియాలో మహేష్ బాబు మరియు గౌతమ్‌ లు ఇప్పుడు అన్న తమ్ముడు మాదిరిగా కనిపిస్తున్నారు అంటున్నారు.

ఇటీవల మహేష్‌ కాస్త జుట్టు పెంచి స్టైలిష్‌ యూత్‌ ఐకాన్‌ టీ షర్ట్స్‌ వేయడంతో ఒక్కో సమయంలో గౌతమ్‌ అనుకుని పొరబడుతున్న వారు కూడా ఉన్నారు. అంతగా మహేష్‌ మరియు గౌతమ్‌ లు అన్న తమ్ముడు మాదిరిగా మారిపోయారు అనిపిస్తుంది. కొన్నాళ్లు అయితే గౌతమ్‌ కంటే మహేష్‌ చిన్నవాడు అన్నా కూడా నమ్ముతారేమో అనిపిస్తుంది.