Begin typing your search above and press return to search.

రిప‌బ్లిక్ డేని ఇలా ప్ర‌చారం చేసుకోవాలా?

By:  Tupaki Desk   |   26 Jan 2020 7:50 AM GMT
రిప‌బ్లిక్ డేని ఇలా ప్ర‌చారం చేసుకోవాలా?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` ఫ‌లితం ఎలా ఉన్నా .. ఇటీవ‌ల ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ట్రెండీ టాపిక్ అయిన సంగ‌తి తెలిసిందే. సరిలేరుపై క్రిటిక్స్ నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చాయి. ఇక ఈ మూవీలో ఆరంభమే ఆర్మీ స‌న్నివేశాలు..క్లైమాక్స్ లో ఆర్మీ గొప్ప‌ద‌నంపై స‌న్నివేశాలు సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలిచాయి. ఆర్మీ గురించి గొప్ప‌ సందేశాన్ని ఇచ్చారు రావిపూడి. దాదాపు 13 ఏళ్ల త‌ర్వాత వెట‌ర‌న్ క‌థానాయిక‌ విజయ‌శాంతి కంబ్యాక్ అయ్యారు. ఇందులో భార‌తి అనే లెక్చ‌ర‌ర్ పాత్ర‌లో.... ఇద్ద‌రు బిడ్డ‌ల‌ను ఆర్మీ కి పంపించిన మాతృమూర్తిగా న‌టించారు.

మ‌హేష్ రోల్ కి ధీటైన పాత్ర‌తో విజ‌య‌శాంతి రీఎంట్రీ ఇవ్వ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. ఆ పాత్ర‌కు మంచి పేరు వ‌చ్చింది. విజ‌య‌శాంతి మాత్ర‌మే ఆ పాత్ర పోషించ‌గ‌ల‌ర‌న్న ప్ర‌శంస ద‌క్కింది. నేడు గ‌ణ‌తంత్ర దినోత్స‌వం (జ‌న‌వ‌రి 26) సంద‌ర్భంగా మ‌హేష్‌- విజ‌య‌శాంతి- అనీల్ రావిపూడి ఆర్మీ అధికారులు...సైనికుల‌తో ఇంట‌రాక్ట్ అయి త‌మ ధేశ‌భ‌క్తిని చాటాకున్నారు. దేశం న‌లుమూలాల ఘ‌నంగా రిప‌బ్లిక్ డే వేడుల్ని సెల‌బ్రేట్ చేయ‌గా.. హైద‌రాబాద్ ఆర్మీ అధికారులతో ఎంబీ టీమ్ వేడుల‌కు నిర్వ‌హించింది.

మ‌హేష్ అండ్ టీమ్ ఆర్మీ క్యాంప్ లో ఉత్సాహం నింపారు. ఆర్మీ కాంపౌండ్ కావ‌డంతో కేవ‌లం ఈ ముగ్గురికి మాత్ర‌మే అనుమ‌తి ల‌భించింద‌ట‌. ఫోటోగ్రాప‌ర్స్ ఎవ‌రికీ అనుమ‌తి లేక‌పోవ‌డంతో ఆర్మీ అధికారులే ఆ ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ ఇంట‌రాక్ష‌న్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. మొత్తానికి స‌రిలేరు టీమ్ రిప‌బ్లిక్ డేని కూడా ప్ర‌చారం కోసం తెలివిగా వినియోగించుకుంటున్నారు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.