Begin typing your search above and press return to search.

ఆ మాస్టర్స్ తో బిగ్ మహేష్ యాక్షన్ ఎపిసోడ్

By:  Tupaki Desk   |   24 Jan 2023 11:48 AM GMT
ఆ మాస్టర్స్ తో బిగ్ మహేష్ యాక్షన్ ఎపిసోడ్
X
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబీ 28 సినిమా గురించి అందరికీ తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రిషేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా గతేడాదిలోనే స్టార్ అయింది. ఓ షెడ్యూల్ కు సంబంధించిన చిత్రీకరణ పూర్తవగా.. సెకండ్ షెడ్యూల్ కూడా ప్రారంభం అయింది. అయితే మహేశ్ బాబు వ్యక్తిగత కారణాల వల్ల సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కి కొంత గ్యాప్ వచ్చింది.

జనవరి 18వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ను ప్రారంబించారు. ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు శ్రీలీల కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇందులో వీరు ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉందని ఇటీవలే డైరెక్టర్ కూడా తెలిపారు.

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 11వ తేదీన రిలీజ్ చేసేందుకు నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన షూటింగ్, ఇతర పనులను చకచకా పూర్తి చేసుకునే పనిలో పడ్డారు.

ఈ సినిమాలో భారీ యాక్షన్ ఫైట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ లు కొరియా గ్రాఫ్ చేస్తున్న ఫైట్ సీన్స్ వచ్చే నెల మొదటి వారంతో పూర్తి కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా సమయం వృథా అయింది కాబట్టి మహేష్ బాబు కూడా ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ఈ సినిమా షూట్ ను పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను హారిక హాసిని దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి నటీనటుల వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీల మాత్రం కన్ఫర్మ్ అయ్యారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.