Begin typing your search above and press return to search.

న్యూ పోస్టర్: రొమాంటిక్ గా మహేష్ -రష్మిక

By:  Tupaki Desk   |   12 Dec 2019 5:10 AM GMT
న్యూ పోస్టర్: రొమాంటిక్ గా మహేష్ -రష్మిక
X
అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు. భారీ అంచనాలు నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు నెలరోజుల సమయమే ఉండడంతో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే టీజర్.. రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసిన 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ తాజాగా ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేసింది.

ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో మహేష్ బాబు - రష్మికలు సూపర్ రొమాంటిక్ మూడ్ లో ఉండడం విశేషం. మహేష్ ఒక చేత్తో రష్మికను స్టైల్ గా పట్టుకుని ఉంటే.. రష్మిక మల్లెతీగ తరహాలో మహేష్ ను అల్లుకు పోయి నవ్వుతూ ప్రేమగా మహేష్ కళ్ళలోకి సూటిగా చూస్తోంది. అందరూ బోర్ అనుకుంటారు అయినా.. మహేష్ అందంగా ఉన్నాడని చెప్పకతప్పదు.. తప్పక చెప్పాల్సిన పరిస్థితి. ఇదే పోస్టర్ లో రిలీజ్ డేట్ ను జనవరి 11 వ తారీఖుగా వెల్లడించారు. ఇప్పటివరకూ సినిమా పోస్టర్లలో ఎక్కువగా రష్మికకు ప్రాధాన్యత దక్కలేదు. టీజర్ లో కూడా రష్మికను చూపించకపోవడంతో రష్మిక అభిమానులు కొందరు నిరాశ చెందారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ తో వారికి ఊరట లభించిందనుకోవాలి.

ఈ సినిమాలో విజయశాంతి.. ప్రకాష్ రాజ్.. రాజేంద్రప్రసాద్.. సంగీత.. హరితేజ.. బండ్ల గణేష్.. వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.