'మహర్షి' పై నమ్మకంతో నిర్మాతల సాహసం

Sun Jan 20 2019 20:22:00 GMT+0530 (IST)

Maharshi Movie Release Date

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రం 'మహర్షి' విడుదల తేదీపై గందరగోళ వాతావరణం నెలకొంది. మొదట ఏప్రిల్ మొదటి వారంలో సినిమా ఉంటుందని అంతా భావించారు. ఏప్రిల్ 5వ తారీకున 'మజిలీ' చిత్రం ఉంటుందని చైతూ సామ్ లు ప్రకటించేశారు. మహర్షి మొదటి వారంలో ఉండదని క్లారిటీ గా తెలుసుకున్న తర్వాతే మజిలీ ఆ తేదీకి ఫిక్స్ అయ్యింది. మజిలీ తేదీ వచ్చిన తర్వాత మహర్షి విడుదల తేదీ గురించి మీడియాలో రక రకాలుగా ప్రచారం జరుగుతుంది.'మహర్షి' చిత్రాన్ని ఏప్రిల్ 26న విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఆ తేదీకే చిత్ర యూనిట్ సభ్యులు మొత్తం ఫిక్స్ అయినట్లుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా 'మహర్షి' చిత్రాన్ని 24వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్లుగా తెలుస్తోంది. సహజంగా ఎక్కువ శాతం సినిమాలు శుక్రవారం విడుదల అవుతాయి. శుక్రవారం మొదటి రోజు సహజంగా మంచి వసూళ్లు నమోదు అవుతాయి శని ఆదివారాలు వీకెండ్స్ కనుక మంచి వసూళ్లు నమోదు అవ్వడం జరుగుతుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా శుక్రవారం సినిమా విడుదలైతే మోస్తరుగా కలెక్షన్స్ నమోదు అవుతాయి.

కాని బుద గురు వారాల్లో విడుదలై నెగటివ్ టాక్ ను తెచ్చుకుంటే మాత్రం వీకెండ్స్ వరకు సినిమా కుదేళై పోతుంది. అందుకే బుద గురు వారాలకు సినిమా ఎవరు కూడా ప్రిపర్ చేయరు. కాని మహర్షి నిర్మాతలు మాత్రం సినిమాపై ఉన్న నమ్మకంతో వీక్ మద్యలో అదే ఏప్రిల్ 24న విడుదల చేయాలని భావిస్తున్నారు. బుద వారం సినిమాను విడుదల చేస్తే ఆది వారం పూర్తి అయ్యే వరకు మంచి వసూళ్లు నమోదవుతాయని దిల్ రాజు ప్లాన్ గా తెలుస్తోంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. దిల్ రాజు అశ్వినీదత్ పీవీపీ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతి త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అల్లరి నరేష్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న కారణంగా సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మొదటి సారి మహేష్ బాబు ఈ చిత్రంలో గడ్డం మీసాలతో కనిపించబోతున్నాడు.