బిగ్ బాస్ లో 'మహానటి '..' అంతకు మించి' ఎవరంటే..

Sun Sep 15 2019 11:03:18 GMT+0530 (IST)

Mahanati and mahanatudu Game in Bigg Boss 3

బుల్లితెర మీద సంచలనాలు సృష్టిస్తున్న రియాలిటీ షో.... బిగ్ బాస్ షో 55 ఎపిసోడ్లు విజయవంతంగా పూర్తి చేసుకుని శనివారం 56 ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఎపిసోడ్ ప్రారంభమవ్వగానే సీరియస్ గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున షూ పాలిష్ చేసి ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చారు. ఆ తర్వాత మొన్న టాస్క్ లో భాగంగా షూ పాలిష్ చేయమంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన పునర్నవి - మహేశ్ లకు గట్టిగా క్లాస్ ఇచ్చారు. అలాగే శ్రీముఖిని కూడా నీ గేమ్ నువ్ ఆడు..వేరే వాళ్ళ గేమ్ చెడగొట్టకు అంటూ వార్నింగ్ ఇచ్చారు.ఇలా హౌస్ మొత్తం సీరియస్ గా ఉన్న తరుణంలో నాగ్ ఇంటి సభ్యులతో ఓ గేమ్ ఆడించారు. ఒక బోర్డు పెట్టి...ఒక్కొక్కరుగా వచ్చి దాని మీద మహానటి లేదా మహానటుడు ఎవరు అనుకుంటున్నారో బోర్డు మీద వారి ఫోటో పెట్టాలని - అలాగే అంతకమించి నటిస్తున్న వారి ఫోటో కూడా పెట్టాలని సూచించారు. దీంతో మొదట వచ్చిన వితికా...మహానటిగా శిల్పాని - అంతకమించి హిమజ ఫోటోలని పెట్టి కారణాలని చెప్పింది. తర్వాత రాహుల్...మహానటి శివజ్యోతి పెట్టగా...అంతకమించి పునర్నవిని పెట్టింది. దీంతో పున్నూ షాక్ అయింది. రాహుల్ క్లోజ్ ఫ్రెండ్ అంటూ... ఏదో చెబుతుంటే మధ్యలో సీరియస్ అయింది. ఫ్రెండ్ అని చెప్పొద్దని చెప్పింది.

అయితే నాగ్ వీరి వాదనని ఆపి నెక్స్ట్ రవిని పిలిచారు..రవి...మహానటిగా శిల్పా - అంతకమించి మహేశ్ ఫోటోలని పెట్టాడు. ఇక బాబా.. మహానటిగా హిమజ - అంతకమించి శిల్పాని సెలక్ట్ చేశారు. అలా ఒక్కొక్కరు గేమ్ ఆడుతుండగా పునర్నవి వంతు వచ్చింది. పున్నూ మహానటిగా హిమజని...అంతకుమించి రాహుల్ ఫోటోని పెట్టింది. ఇక రాహుల్ గురించి కారణం చెప్పి...ఇంతటితో రాహుల్ ఫ్రెండ్ షిప్ కి దండం అని చెప్పి...ఇంతటితో తన స్నేహం వద్దని చెప్పింది. రాహుల్ కూడా నాకు అక్కర్లేదులే అంటూ మాట్లాడాడు. మొత్తం మీద వీరి ఫ్రెండ్ షిప్ కు శనివారం ఎపిసోడ్ లో ఎండ్ కార్డ్ పడింది. మరి రానున్న రోజుల్లో వీరు ఎలా నడుచుకుంటారో ? చూడాలి.