ట్రైలర్: 'మహాసముద్రం' లో మహా యుద్ధం మొదలైంది..!

Thu Sep 23 2021 19:05:13 GMT+0530 (IST)

Maha Samudram Trailer Talk

వర్సటైల్ యాక్టర్స్ శర్వానంద్ - బొమ్మరిల్లు సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ''మహాసముద్రం''. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. వరుస అప్డేట్స్ తో సినిమాపై బజ్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా 'మహాసముద్రం' థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది'సముద్రం చాలా గొప్పది.. చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుంది' అని శర్వానంద్ చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. 'నువ్వు సముద్రం లాంటి వాడివి అర్జున్.. నీలో కలవాలని అన్నీ నదులు కోరుకుంటాయ్' అని అదితి తన అమాయకపు స్వభావాన్ని వెల్లడించింది. అయితే అర్జున్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా అతను హింసాత్మకంగా మారతాడని తెలుస్తోంది. 'ఇక్కడ మనకు నచ్చినట్టు బ్రతకాలంటే.. మన జాతకాన్ని దేవుడు మందు కొట్టి రాసుండాలి' అని సశర్వా చెప్తుండటంతో అతని జీవితంలో ఏదో జరిగిందనేది అర్థం అవుతోంది.

ఇందులో శర్వానంద్ తన గెటప్ తో పాటుగా క్యారెక్టర్ లో కూడా వైవిధ్యం చూపించాడు. ఇక సిద్ధార్థ్ పాత్రకు కూడా ఈక్వల్ ఇంపార్టన్స్ ఇచ్చారు. "మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా..' అని సిద్ధార్థ్ చెప్పడంలో పరిస్థితులకు అనుగుణంగా అతను కూడా తప్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. శర్వా - అను ఇమ్మాన్యుయేల్ మధ్య లిప్ లాక్ సీన్ ఉండగా.. అదితి రావు హైదరి కూడా బోల్డ్ రోల్ లో కనిపిస్తుంది. అయితే ఇందులో ఎవరు ఎవరిని లవ్ చేస్తున్నారనే విషయాన్ని తెలియకుండా ట్రైలర్ ను కట్ చేశారు. జగపతి బాబు - రామ్ రమేష్ మరియు KGF రామచంద్ర రాజు - శరణ్య కూడా తమ పాత్రలను అద్భుతంగా పోషించారని తెలుస్తోంది.

'Rx100' వంటి విభిన్నమైన సినిమా తర్వాత దర్శకుడు అజయ్ భూపతి మరోసారి తన వినూత్నమైన కథ కథనాలతో.. అద్భుతమైన టేకింగ్ తో ఆశ్చర్యపరిచేందుకు సిద్ధంగా ఉన్నారని 'మహా సముద్రం' ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. పాత్రలను కూడా చాలా బలంగా రాసుకున్నారు. సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట కెమెరా పనితనం.. చైతన్ భరద్వాజ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఇందులో అజయ్ భూపతి డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 'నవ్వుతూ కనిపిస్తున్నంత మాత్రాన బాగున్నట్టు కాదు' 'నేను దూరదర్శన్ లో మహా భారత యుద్ధం చూసిన మనిషిని రా.. ఎదుతోడు వేసిన బాణానికి ఏ బాణమేయలో నాకు బాగా తెలుసు' వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

మొత్తం మీద 'మహాసముద్రం' ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉండటంతో పాటుగా సినిమాపై అంచనాలను పెంచేసింది. అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా.. కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేశారు. విజయ దశమి సందర్భంగా ప్రేక్షకుల ముందులు వస్తున్న ఈ తీవ్రమైన యాక్షన్ డ్రామా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.