Begin typing your search above and press return to search.

డిసెంబ‌ర్ 31 ఛీర్స్: మిమిక్రీ.. మెజీషియ‌న్స్ ప్యాకేజీ?

By:  Tupaki Desk   |   10 Oct 2019 3:30 AM GMT
డిసెంబ‌ర్ 31 ఛీర్స్: మిమిక్రీ.. మెజీషియ‌న్స్ ప్యాకేజీ?
X
డిసెంబ‌ర్ 31 రాత్రి సెల‌బ్రేష‌న్స్ కి న‌గ‌రాలు ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌ల్లో మునిగి తేలాయి. క్ల‌బ్బు-ప‌బ్బు-రిసార్ట్-రెస్టారెంట్.. కాదేదీ నైట్ పార్టీక‌న‌ర్హం. తార‌ల డ్యాన్సుల‌తో పాటుగా క‌మెడియ‌న్ల స్కిట్ లు.. మ్యాజిక్ షోలు.. మ్యూజిక్ షోలు.. డీజే షోలు .. అబ్బ‌బ్బ ఆ సంద‌డే వేరు! ఫ్లూటుగా మందేసి చిందేసి యూత్ చేసే ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. అందుకు త‌గ్గ‌ట్టే ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ఈవెంట్ కి హీరోయిన్లు..గాయ‌నీగాయ‌కులు.. క‌మెడియ‌న్లు.. కొరియోగ్రాఫ‌ర్లు వీళ్లంతా ఎంత పేమెంట్లు తీసుకుంటారో తుపాకిలో వెల్ల‌డించాం. తాజా స‌మాచారం మేర‌కు.. ఈ ఈవెంట్ల‌కు మిమిక్రీలు చేసేవాళ్లు.. మెజీషియ‌న్లు ఏ రేంజు ప్యాకేజీలు అందుకుంటారు? అలాగే తెర‌వెన‌క టెక్నీషియ‌న్లు ఎంత బాదుతారు? అన్న‌ది చూస్తే షాకిచ్చే నిజాలే తెలిశాయి.

మిమిక్రీ.. మెజీషియ‌న్ల ప్యాకేజీ రేంజు ఇలా ఉంది...

వసంత్‌.. అంతర్జాతీయ మెజీషియ‌న్ -4 లక్షలు

డిటిఎస్ ఆనంద్ -50 కె -75 కె
మిమిక్రీ ఆర్టిస్ట్ జితేంద్ర (ప్రపంచ ప్రఖ్యాత) -1.5 –2 లక్షలు
శివా రెడ్డి మిమిక్రీ - 3 లక్షలు
4 కాళ్ళు కిరణ్ -50 కే -75 కే
గాలిపటకల సుధాకర్ .. జట్టు -1.5-2 లక్షలు
మిమిక్రీ శేఖ‌ర్ -30 కె -50 కె
ఇంద్రజాలికులు రమ్య -50 కె
సద్దాం హుస్సేన్ కామెడీ టీమ్ -50 కె -75 కె
దేశ‌భ‌క్తి స్కిట్లు వ‌గైరా టాలెంట్ ప్రదర్శన -1.5-2 లక్షలు

ఫోటోగ్రఫి:

ఎడిటింగ్ తో వీడియో + ఫోటో (5 డి): రూ. 50.000 / -
జిమ్మీ -1.25 లక్షలతో 4 కామ్ సెటప్ ల‌భిస్తుంది..

ప్రైవేట్ భద్రత:

సాధారణ బౌన్సర్లు: ఒక్కొక్కరికి రూ.2400
సఫారి బౌన్సర్లు: ఒక్కొక్కరికి రూ .2500
గన్ మెన్ సెక్యూరిటీ ఒక‌రికి రూ.6000

హోస్టింగ్ గర్ల్స్:

సాధారణ: రూ.4500
ప్రీమియం: రూ.6000

మోడల్స్:

సాధారణం: రూ.10,000
ఉత్తమ మోడల్: రూ .15,000
టాప్ మోడల్: రూ .20,000

పీఆర్ కార్యాచరణ:

సాధారణ (పరిమిత): రూ .50,000 / -
హై ఎండ్ (ఫుల్ రేంజ్): రూ. 1,00,000 / -

ఈవెంట్ ప్లానింగ్ ప్రొడ‌క్ష‌న్ విధానం:

బాగా శిక్షణ పొందిన .. అనుభవజ్ఞులైన బృందంతో ఈవెంట్ నిర్వాహ‌కులు అందుబాటులో ఉన్నారు. బడ్జెట్ రేంజ్.. అవసరాలకు అనుగుణంగా పూర్తి ఈవెంట్ ను నిర్వ‌హించేందుకు ప్యాకేజీ ఉంటుంది. ఈ ఈవెంట్ల‌లో ప్రతిదీ వాళ్ల‌దే బాధ్య‌త‌. స‌క్సెస్ చేసి వెళ్లే బాధ్య‌త వీళ్ల‌దే. కాస్ట్యూమ్స్- స్టాఫ్- మేకప్- ట్రావెలింగ్ .. వసతి అదనపు ఖ‌ర్చులేవీ పైన ఇచ్చిన వేతనాల‌తో సంబంధం లేదు. ఇవ‌న్నీ అద‌నం. ప్రతిదీ చర్చించి నిర్వాహ‌కుల‌తో మాట్లాడుకోవాల్సి ఉంటుంది.