మరో రీమేక్ కూడా ఓటీటీ కన్ఫర్మ్!

Tue Jul 20 2021 16:11:50 GMT+0530 (IST)

Maestro movie is expected to be released by OTT on August 15 if all goes as planned

టాలీవుడ్ లో రూపొందుతున్న చిన్న సినిమాలు మాత్రమే ఇప్పటి వరకు ఓటీటీలో విడుదల అయ్యాయి. సెకండ్ వేవ్ తర్వాత నారప్ప సినిమా ఓటీటీ రిలీజ్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. సెకండ్ వేవ్ తర్వాత ఓటీటీ రిలీజ్ అయిన పెద్ద సినిమాగా నారప్ప నిలిచింది. వెంకటేష్ నటించిన నారప్పకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.నిర్మాతలు పెట్టిన మొత్తంకు ఎక్కువ మొత్తం రావడంతో పాటు పలు కారణాల వల్ల థియేటర్ల కంటే ఓటీటీ రిలీజ్ కు ఎక్కువ మంది నిర్మాతలు మొగ్గు చూపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. థియేటర్ రిలీజ్ అయితే ఎంత వసూళ్లు వస్తాయో చెప్పలేని పరిస్థితి. కనుక ఓటీటీ విడుదల చేస్తే మినిమం లాభాలు ఖాయం అని నిర్మాతలు ప్రయోగాలు వద్దని సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

నారప్ప సినిమా తో పాటు దృశ్యం.. విరాటపర్వం ఇంకా కొన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారి సమర్పణలో రూపొందిన సినిమాలు కూడా ఓటీటీలో వస్తాయని సురేష్ బాబు ఇటీవల ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చారు. ఆయన సినిమాల విడుదల విషయంలో తనది తుది నిర్ణయం కాదని.. తమ భాగస్వామ్యులు ఎలా రిలీజ్ కు వెళ్లాలని అనుకుంటే అలాగే మేము వెళ్లాలి తప్ప సొంత నిర్ణయాలు తీసుకోలేమని సురేష్ బాబు అనడంలో మరి కొన్ని సినిమాలు ఓటీటీ ద్వారా విడుదల కావడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఈ సమయంలోనే యంగ్ హీరో నితిన్ నటించిన మాస్ట్రో ను కూడా ఓటీటీ రిలీజ్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ప్రముఖ ఓటీటీ ఈ సినిమాకు భారీ మొత్తంను కోట్ చేసిందట. పెట్టిన ఖర్చు కంటే ఎక్కువ మొత్తంను సదరు ఓటీటీ వారు ఇచ్చేందుకు సిద్దం అవ్వడంతో థియేట్రికల్ రిలీజ్ కు అంత బిజినెస్ అయ్యేనో లేదో.. పైగా థియేట్లు ఓపెన్ అయినా మళ్లీ కరోనా థర్డ్ వేవ్ అంటూ వస్తే మాస్ట్రో సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

తద్వార బడ్జెట్ భారం మరింతగా పెరుగుతుందని అందుకే ఓటీటీ రిలీజ్ కు వెళ్లాలని నితిన్ అండ్ టీమ్ భావిస్తున్నారట. బాలీవుడ్ మూవీ అంధాదున్ కు రీమేక్ గా రూపొందిన మాస్ట్రో సినిమా అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టు 15వ తారీకున ఓటీటీ ద్వారా విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు.

నితిన్ కు జోడీగా ఈ సినిమాలో నభా నటేష్ నటించగా మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటించింది. హిందీ వర్షన్ లో టబు పోషించిన పాత్రను తమన్నా పోషించడం  తో పాటు నితిన్ ఈ సినిమాలో గుడ్డి వాడిగా కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఒరిజినల్ వర్షన్ కు భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి.

కనుక ఈ సినిమా కూడా థియేటర్ ద్వారా వస్తే మంచి వసూళ్లు వచ్చేవి అని కొందరి అభిప్రాయం. కాని కరోనా భయం ఇంకా ఉండటం వల్ల జనాలు థియేటర్లకు వచ్చేది అనుమానమే అందుకే మాస్ట్రో నిర్ణయం సరైనదే అని కొందరు అంటున్నారు.