Begin typing your search above and press return to search.

చివరి నిమిషంలో ఆ సీన్స్‌ లేపేసిన 'మాస్ట్రో'

By:  Tupaki Desk   |   15 Sep 2021 4:32 AM GMT
చివరి నిమిషంలో ఆ సీన్స్‌ లేపేసిన మాస్ట్రో
X
నితిన్ హీరోగా నభా నటేష్‌ హీరోయిన్ గా తమన్నా ముఖ్య పాత్రలో నటించిన మాస్ట్రో సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. నేరుగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై నితిన్ చాలా నమ్మకంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. బాలీవుడ్‌ సినిమాకు రీమేక్ గా రూపొందిన మాస్ట్రో లో తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా చాలా మార్పులు చేయడం జరిగింది. సినిమాలో తమన్నా ముఖ్య పాత్రను పోషించడం వల్ల ఖచ్చితంగా అంచనాలు పెరిగాయి అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో సినిమాకు ఫినిషింగ్ టచ్ ను ఎక్స్‌ పర్ట్స్ తో కలిసి యూనిట్‌ సభ్యులు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎలాగూ ఓటీటీ లో విడుదల చేస్తున్నాం కదా అని కాస్త శృతిమించిన శృంగార సన్నివేశాలను నితిన్ మరియు నభా పై చిత్రీకరించారట. వాటిని ఫైనల్‌ ఎడిటింగ్ లో ఉంచారు. అయితే చివరి నిమిషంలో ఆ శృతిమించిన సన్నివేశాలను తొలగించినట్లుగా చెబుతున్నారు.

శృతి మించిన ఆ శృంగార సన్నివేశాలు ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ చూడటానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఓటీటీ కనుక ఇంట్లో పిల్లలతో కలిసి సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్‌ చూపిస్తారు. అలాంటి సన్నివేశాలు ఉండటం వల్ల సినిమాను చూసేందుకు జనాలు ఆసక్తి చూపించక పోవచ్చు.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో వ్యతిరేకత వస్తే సినిమాకు డ్యామేజీ అంటూ యూనిట్‌ సభ్యులు చివరి నిమిషంలో ఆలోచించి ఆ సన్నివేశాలను లేపేశారని మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. నితిన్ ఈ సినిమాలో నితిన్ గుడ్డి వాడి పాత్రలో నటించాడు. అవసరం కోసం గుడ్డి వాడు అయిన హీరో పడే కష్టాలను చాలా ఫన్నీగా ఎమోషనల్ గా చూపించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. తమన్నా మరియు నితిన్ లు పోటీ పడి నటించారంటూ యూనిట్‌ సభ్యులు మొదటి నుండి చెబుతున్నారు. తప్పకుండా సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని అంటున్నారు.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నభా నటేష్ మరియు నితిన్ ల మద్య లవ్ ట్రాక్‌ చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. నభా నటేష్ ను ఈ సినిమాలో చాలా బోల్డ్‌ గా కొత్తగా చూస్తారని కూడా మేకర్స్ చెబుతున్నారు. మొత్తానికి ఈ సినిమాతో నితిన్‌ మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. థియేటర్లు ఫుల్‌ గా ఓపెన్ అయ్యి మంచి వసూళ్లు కూడా వస్తున్న సమయంలో మాస్ట్రో సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయడంను కొందరు తప్పుబడుతున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిన కారణంగా ఆర్థిక ఇబ్బందులతో సినిమాను ఓటీటీకి గతంలోనే అమ్మేయడం జరిగింది. అందుకే ఇప్పుడు థియేటర్‌ రిలజ్ కు వెళ్లే అవకాశం లేకుండా పోయిందని మేకర్స్‌ నుండి సమాధానం వస్తుంది. అయితే ఓటీటీ ద్వారా ఇటీవల విడుదల అయిన టక్ జగదీష్ కు నెగటివ్ టాక్ వచ్చింది. మరి నితిన్ కు మాస్ట్రో ద్వారా పాజిటివ్ టాక్‌ వచ్చేనా అనేది చూడాలి. నితిన్ చెక్ మరియు రంగ్ దే సినిమాలతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చెక్ నిరాశ పర్చగా రంగ్ దే సినిమా పర్వాలేదు అనిపించింది. మాస్ట్రో ఆయనకు సక్సెస్ అయితే ముందు ముందు రాబోతున్న సినిమాలకు మంచి బజ్ క్రియేట్‌ అయ్యే అవకాశం ఉంది.