చీరలో ఉట్టిపడుతున్న అందాలన్నీ మధురమే!

Tue May 26 2020 15:40:11 GMT+0530 (IST)

Madhurima Stunning Pose In Saree

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ మధురిమ గుర్తుందా.. అదేనండి కొత్తజంట సినిమాలోని 'అటు అమలాపురం.. ఇటు పెద్దాపురం' పాటలో ఆడిపాడింది. ఆ పాటలో కుర్రకారుతో కేకలు పెట్టించిన ఈ భామ.. 'ఆ ఒక్కడు' 'మౌనరాగం' 'సరదాగా కాసేపు' సినిమాలు చూసిన వాళ్లకి మధురిమ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అయితే మధురిమ తెలుగులో చేసిన సినిమాలన్ని బాగున్నాయని టాక్ వచ్చినా ఈ భామకు మాత్రం ప్రత్యేకమైన గుర్తింపును తీసుకు రాలేకపోయాయి. తెలుగులో అవకాశాలు అడపాదడపా మాత్రమే పలకరిస్తూ ఉండటంతో ఈ భామ బాలీవుడ్ ను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది. సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువనే సంగతి తెలిసిందే. పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని లేదా పేరులో ఏదైనా అక్షరం మార్చుకుంటే బ్రేక్ వస్తుందని నమ్ముతుంటారు. కెరీర్ డీలా పడినపుడల్లా ఇలా చేస్తుంటారు. ఇప్పుడు తాజాగా మధురిమ పరిస్థితి అలాగే తయారైంది. నటుడు అజయ్ హీరోగా పరిచయమైన 'ఆ ఒక్కడు' సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ గుమ్మా.ఈ బ్యూటీ పలు తెలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే కెరీర్లో ఇంతవరకు సరైన బ్రేక్ దొరకలేదు. దాంతో ఇప్పుడామె తన పేరు మార్చుకుని మార్చుకుంది. మదురిమ తన పేరుని నైనా బెనర్జీగా మార్చుకుంది. బాలీవుడ్లో 'వన్ నైట్ స్టాండ్' అనే అడల్ట్ కంటెంట్ మూవీలో అందాల ఆరబోత చేసింది. ఈ సినిమాతో బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని అనుకుంది. అందుకే మధురిమగా ఉన్న తన పేరుని నైనా బెనర్జీగా మార్చుకుంది. టాలీవుడ్ లో నటించిన ఈ భామకు బ్రేక్ రాలేదు. దాంతో కన్నడ - మలయాళ చిత్రాల్లో కూడా చాలానే ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. తెలుగులో చాలా సినిమాలు చేసిన మధురిమ.. హీరోయిన్ గాను ఐటెం భామగాను అలరించింది. ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్ పక్కన కాసేపు కనిపించిన ఎక్స్ పీరియన్స్ కూడా ఉంది. ఇక అమ్మడు తాజాగా ఇంస్టాగ్రామ్ లో పింక్ సారీలో ఫోటో పోస్ట్ చేసింది. చీరలో అమ్మడి అందాలు రెట్టింపు అయ్యాయని చెప్పాలి. చీరలో అమ్మడి అందాలన్నీ అభిమానుల మతులు పోగొడుతున్నాయి. ప్రస్తుతం ఇటు దక్షణాదినా అటు ఉత్తరాదిన  తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం లో ఉన్నాననీ ఫలానా భాషా చిత్రాలను మాత్రమే చేస్తాననే పరిస్థితిలో తాను లేనని మధురిమ చెబుతోంది.