Begin typing your search above and press return to search.

ముజ్రా డ్యాన్స్ తో మాయ చేయబోతున్న మాధురి!

By:  Tupaki Desk   |   15 Feb 2020 1:08 PM GMT
ముజ్రా డ్యాన్స్ తో మాయ చేయబోతున్న మాధురి!
X
మాధురి దీక్షిత్ 80..90 లలో బాలీవుడ్ ను ఏలిన స్టార్ హీరోయిన్. శ్రీదేవి తర్వాత బాలీవుడ్ లో ఆ స్థాయి స్టార్ డమ్ ను చూసిన హీరోయిన్ కూడా మాధురినే. మాధురి కెరీర్లో బ్లాక్ బస్టర్లు.. ఇండస్ట్రీ హిట్లు లెక్కలేనన్ని ఉన్నాయి. అందంతో పాటు అద్భుతమైన నటన మాధురి సొంతం. ఇక మాధురి బాలీవుడ్ లో ఉన్న బెస్ట్ డ్యాన్సర్లలో ఒకరు. మాధురి డ్యాన్స్ కు అప్పట్లో థియేటర్లు దద్దరిల్లిపోయేవి.

మాధురి కెరీర్లో ఎన్నో పాటలు ఉన్నప్పటికీ ముజ్రా పాటలు మాత్రం హైలైట్. 'మార్ డాలా' లాంటి సూపర్ హిట్స్ లో మాధురి డ్యాన్స్ చేసి అందరినీ మెస్మరైజ్ చేశారు. త్వరలో మాధురి ఇలాంటి ముజ్రా పాటలతో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. అస్సాం లోని గువహటిలో జరగనున్న 65 వ అమెజాన్ ఫిలింఫేర్ అవార్డ్స్ ఫంక్షన్లో మాధురి లైవ్ పెర్ఫామెన్స్ ఇస్తారట. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి గువహటిలోని ఇందిరా గాంధి అథ్లెటిక్ స్టేడియంలో జరుగుతుందని సమాచారం. ఫిబ్రవరి 16 రాత్రి 9 గంటలకు కలర్స్ టీవీలోప్రసారం చేస్తారని సమాచారం.

ఈ కార్యక్రమం కోసం మాధురి రిహార్సల్స్ జోరుగా చేస్తున్నారట. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ షైమాక్ దవార్ ఈ కార్యక్రమానికి కోరియోగ్రఫీ అందిస్తున్నారట. ఫిబ్రవరి 14 న అలా రిహార్సల్ చేసే సమయంలో మాధురి డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా హల్చల్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో మాధురితో బాలీవుడ్ హీరో రణవీర్ సింగు కూడా స్టెప్పులు వేస్తాడట.సింగుగారు.. మాధురి మేడమ్ 'మార్ డాలా మార్ డాలా' అంటే జనాలు ఫసాక్ కావడం ఖాయమే.