Begin typing your search above and press return to search.

లేడీ టీచర్ చెప్పిన విషయానికి లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న శివ బాలాజీ భార్య...!

By:  Tupaki Desk   |   19 Sep 2020 10:50 AM GMT
లేడీ టీచర్ చెప్పిన విషయానికి లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న శివ బాలాజీ భార్య...!
X
టాలీవుడ్ నటులు శివ బాలాజీ దంపతులు ఇటీవల ఆన్‌ లైన్ క్లాసుల పేరిట ప్రైవేట్ పాఠశాలలు భారీగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను పీడిస్తున్నారంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలోని మణికొండలో ఉన్న మౌంట్‌ లిటేరా జీ స్కూల్ యాజమాన్యంపై ఆయన మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. శివ బాలాజీ ఫిర్యాదుకు స్పందించిన హ్యూమన్ రైట్స్ కమిషన్.. ఆ స్కూల్‌ పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తూ దీనిపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డీఈఓకి నోటీసులు జారీ చేసింది. దీంతో ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలు మీడియా ఛానల్స్ చర్చావేదికలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఓ ఛానల్ లైవ్ లో ఆ స్కూల్ తీరుపై మాట్లాడిన శివ బాలాజీ సతీమణి, నటి మధుమిత ఎమోషనల్ అయ్యారు.

మధుమిత లైవ్ లో మాట్లాడుతూ తమ పిల్లల గురించి మాత్రమే తాము ఇదంతా చేయలేదని.. ఇలాంటి ఎన్నో విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను పీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మౌంట్‌ లిటేరా జీ స్కూల్‌ లో పని చేసిన ఓ లేడీ టీచర్ ఈ లైవ్ లోకి వచ్చి మాట్లాడుతూ.. తాను ఆ స్కూల్‌ లో సంవత్సరం పాటు టీచర్ గా వర్క్ చేశానని, అదే సమయంలో తనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే.. 'నీకెందుకు ఈ టైమ్‌ లో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని' స్కూల్ యాజమాన్యం అడిగిందని చెప్పుకొచ్చింది. ఈ మాటలు విన్న మధుమిత లైవ్‌ లోనే కన్నీళ్లు పెట్టుకుంటూ మౌంట్‌ లిటేరా జీ స్కూల్ యాజమాన్యంపై మండిపడింది.