#మనోహరి.. మధు స్నేహ ఏం చేస్తోంది?

Sun Nov 28 2021 16:00:01 GMT+0530 (IST)

Madhu Sneha In Bahubali Manohari Song

`బాహుబలి: ది బిగినింగ్`లో మనోహారి పాటలో అలరించిన మధుస్నేహ తొలి సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. కానీ  వెండి తెరపై రాణించడంలో మాత్రం విఫలమైంది. పెద్ద స్థాయిలో ఐడెంటిటీ దక్కినా  సినిమా అవకాశాలు అందుకోలేకపోయింది. అందుకు గల కారణాలు పక్కనబెడితే బుల్లి తెరపై మాత్రం బిజీ అయింది. ప్రస్తుతానికి వెబ్ సిరీస్ లలో బాగానే అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్ కూడా ఓటీటీదే కావడంతో మధుస్నేహ వెండి తెరపైనా అంతగా ఫోకస్ పెట్టినట్లు కనిపించలేదు. ఇక మధుస్నేహ సినిమాల్లోకి రావడం చాలా ఆసక్తికరంగా జరిగింది.మధు స్నేహ పుట్టింది కోల్ కత్తాలో.. పెరిగింది ముంబైలో. చిన్నప్పుడే సినిమాలపై మక్కువతో తల్లిదండ్రులకు తెలియకుండా ఆడిషన్స్ కి వెళ్లింది. కానీ అలా వెళ్లడం ఇంట్లో నచ్చక తన్నులు తిందిట. అలా మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అక్కడ నుంచి కెరీర్ ని బిల్డ్ చేసుకునే ప్రయత్నాల్లో చాలా యాడ్స్ లో నటించింది. చివరిగా 2015లో `బాహుబలి`లో అవకాశం దక్కింది. ఆ తర్వాత  సినిమా అవకాశాలు రాకపోవడంతో  `ది ఎట్స్ ట్రాస్` అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఓటీటీపై బాగానే పాపులర్ అయింది. తర్వాత యూట్యూబ్ వీడియోలు.. షార్ట్ ఫిలింస్ చేస్తూ బిజీ అయింది.

ప్రస్తుతం `బేకాబ్` అనే సిరీస్ లో నటిస్తోంది. ఇక తల్లిని వయసులో ఉన్నప్పటి ఫోటోలు చూసి సినిమా హీరోయిన్ అయితే పెద్ద స్టార్ అయ్యేదని భావించేదిట. తన తల్లి అంత అందంగా ఉంటుందని...కానీ ఆమెకు అవకాశం లేకపోవడంతో సినిమా రంగం వైపు రాలేదని తెలిపింది. కానీ ఆ ఛాన్స్ కుమార్తెగా తనకి దక్కిందని.. అందుకు చాలా గర్వంగా ఉందని తెలిపింది. ప్రస్తుతం కెరీర్ పరంగా సంతోషంగా ఉన్నానని.. వెండి తెరపైనా బిజీ అవుతానని ధీమాను వ్యక్తం చేసింది.