Begin typing your search above and press return to search.

ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చా.. ఎవరికీ బానిసను కాను.. నటి సంచలన పోస్టు

By:  Tupaki Desk   |   3 Aug 2020 5:00 AM GMT
ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చా.. ఎవరికీ బానిసను కాను.. నటి సంచలన పోస్టు
X
అభిమానిస్తే దాన్ని వ్యక్తపర్చటం.. మనసుకు బాధ కలిగితే.. భేషజాలు లేకుండా దుమ్ము దులిపేసే ధోరణి అందరికి సాధ్యం కాదు. ఎందుకంటే.. దానికెంతో గట్స్ కావాలి. అలాంటివి తన దగ్గర టన్నుల కొద్దీ ఉంటాయని తన మాటలతో తరచూ స్పష్టం చేస్తుంటారు టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ మాధవి లత. చేసిన సినిమాలు తక్కువే అయినా.. యూట్యూబ్ లో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆమెకు సరికొత్త ఇమేజ్ ను క్రియేట్ చేశాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె.. తరచూ తన పోస్టులతో హాట్ టాపిక్ గా మారుతుంటారు.

తాజాగా అలాంటి పరిస్థితే తన తాజా పోస్టులతో నెలకొందని చెప్పాలి. సినిమాలకు దూరమైనప్పటికీ.. తనను వెతుక్కుంటూ వచ్చే అవకాశాల్లో మాత్రం తన శాయశక్తులా నటించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ మధ్యనే ఆమె బీజేపీలో చేరారు. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి వచ్చానే తప్పించి.. ఎవరికి బానిసగా ఉండేందుకు రాలేదంటూ తాజాగా పోస్టు చేసిన ఒక పోస్టులో పేర్కొన్నారు.

‘‘బుధ్యతారాహిత్యంగా ఉండటం తప్పు. సొంత అవసరాలకి ఆబ్లిగేషన్స్ కి లొంగటం తప్పు. ఇప్పటివరకు నా అదృష్టానికి ఎవరూ నా జోలికి రాలేదు. అందరు పద్దతిగా మర్యాదగా.. హుందాగా నాతో వ్యవహరించారు. అందుకే నేనెప్పుడూ మాట్లాడలేదు. వృత్తి పరంగా బాధ్యతలు తప్పేవాళ్ళకి అపుడపుడు చురకలు వేస్తూనే ఉంటా అదీ నా స్టైల్ లో. ప్రజల కోసం పని చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను .. ఎవరికీ బానిసని కాను ఊడిగం చేయను’’ అని పేర్కొన్నారు.

ఇటీవల తనకు ఎదురైన చేదు ఉదంతాన్ని తన పోస్టు ద్వారా చెప్పే ప్రయత్నం చేశారా? అన్నది సందేహంగా మారింది. దీనికి నిదర్శనంగా ఆమె ప్రస్తావించిన కొన్ని అంశాల్ని చూస్తే.. ‘‘సినిమా రంగంలో సమస్యలు తెలిసే వచ్చా. పోరాడే తెలివి ఉంది కనుకనే అలాగే బతికా. రాజకీయంలో చదరంగం తెలిసి ఉండాలి. నాకు అంతగా రాదు.. అయినా తెగించి వచ్చా. పార్టీ ఎప్పటికి మంచిదే కానీ మనుషులంతా మంచోళ్లా అంటే ఎప్పటికి కాదనే అంటాను. మాట మార్చను. కాకపోతే అన్ని అవసరాలే’’ అని ఆమె పేర్కొన్నారు.

ముక్కుసూటిగా ఉంటానని.. తెర వెనుక నటించే అవసరం లేదని స్పష్టం చేసిన ఆమె.. తన వ్యక్తిగత జీవితం ఎవరికైనా అనవసరమని తేల్చేశారు. ‘‘పక్కవాళ్ల జీవితంలో వేలు కాళ్లు పెట్టటం సంస్కార హీనం. మీ అమ్మానాన్నలు మీకు నేర్పించలేదేమో? సోషల్ మీడియా సైకోలకు చెబుతున్నా.. పక్కవాళ్ల పర్సనల్ విషయాల్లో జోక్యం అంటే అది నీచం.. ఛండాలం.. నేరం. అందుకే పక్కవారి జీవితాల్లోకి వెళ్లకండి’’ అని ఫైర్ అయ్యారు.

మరో సందర్భంలో.. ‘‘అంతో ఇంతో అమ్మా నాన్నలకు పుట్టి ఉంటే.. పద్దతిగా ఉండండి. కాదు మాకు మరే పని లేదు. మేం పక్కనోళ్ల మీద పడి ఏడుస్తాం. మా పని పక్కింట్లోకి తొంగి చూడటమే. పడకగదిలో కెమెరాలు పెడతాం.. ఫేస్ బుక్ లో దూరి జనాల్ని తిడతామంటే మీ కర్మకు మీరే బాధ్యులు’’ అని మండిపడ్డారు. ఇంతకీ మాధవిలత ఈ మాటల్ని ఎవర్ని ఉద్దేశించి అన్నదో మాత్రం తన పోస్టులో పేర్కొనలేదు. తాజాగా మరో పోస్టు లో సింఫుల్ సందేశాన్ని పోస్టు చేశారు. కొద్ది మంది తనను ఇష్ట పడరని.. ఎందుకంటే తాను ఎవరికి తలవంచనని స్పష్టం చేశారు. అదే సమయంలో తనను ఇష్టపడేవారిని తాను తల వంచేలా చేయనని పేర్కొన్నవైనం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.