నయనతారతో ధోనీ సినిమా అంతా తూచ్!

Fri May 13 2022 21:00:01 GMT+0530 (IST)

MS Dhoni Nayanthara for a movie

రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోని వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే రెస్టారెంట్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. దానిలకి  అనుబంధంగా ఉండే పౌల్ర్టీ వ్యాపారంలోనూ పెట్టుబడులు పెడుతున్నారు.  రాంచీలోని ఫాంహౌజ్‌లో ఆర్గానిక్ పౌల్ట్రీ  పరిశ్రమను నెలకొల్పేదిశగా మహీ టీం ముందుకు సాగుతోంది. దేశంలో కడక్ నాద్ కోళ్లకి  కి ఉన్న బిజినెస్ క్రేజ్ కారణంగా ఆ వ్యాపారంపై దృష్టి పెట్టి ముందుకు కదులుతున్నారు.వీటితో పాటు ధోని సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ లో  సొంతంగా నిర్మాణ సంస్థని స్థాపించి సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ధోని బ్రాండ్ తో ఆ చిత్రాలు ప్రపంచ వ్యాప్తం చేయాలని గట్టిగానే ప్లాన్ చేసి దిగుతున్నాడు. ఇప్పటికే ధోని ఎంటర్ టైన్ మెంట్స్ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో బ్యానర్ స్థాపించారు.

అయితే మొదటి సినిమాతో కోలీవుడ్  స్టార్ హీరోయిన్ నయనతారతో  నిర్మిస్తున్నట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. నయన్ కోసం ధోని అదిరిపోయే లేడీ ఓరియేంటెడ్ స్ర్కిప్ట్ ఎంపిక చేసారని..ఆ చిత్రాన్ని పాన్ ఇండియా కేటగిరిలో రిలీజ్  చేసేలా పావులు కదుపుతున్నట్లు మీడియాలో ప్రచారం సాగుతుంది.

తాజాగా  ఆ వార్తల పై ధోని ఎంటర్ టైన్మెంట్ టీమ్ స్పందించింది. దయచేసి ఇలాంటి పుకార్లని నమ్మొద్దని.. ప్రస్తుతానికి తమ టీమ్ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తోందని ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అప్పటి వరకూ ఎలాంటి అసత్యాలు ప్రచారం చేయోద్దని  విజ్ఞప్తి  చేసింది. అసలు ఈ పుకారు ఎలా పుట్టిందో అర్ధం కావడం లేదని విచారం వ్యక్తం చేసారు.

దీంతో ధోనీ- నయనతార  ప్రాజెక్ట్ గాలి వార్తని తేలిపోయింది. క్రికెటర్లు సినిమా రంగంలో ఉన్నది పెద్దగా ఎక్కడా లేదు.  మాజీ క్రికెటర్ శ్రీశాంత్ మాత్రం మ్యాకప్ వేసుకున్నాడు. బాలీవుడ్ లో `అక్సర్-2`.. `కాబరేట్` చిత్రాల్లో నటించాడు. అలాగే మలయాళంలో `టీమ్-5`.. కన్నడలో `కెంపెగౌడ` చిత్రాల్లో నటించాడు. ఇటీవలే విడుదలైన తమిళ్ సినిమా `కాతువాకులా  రెండు కదల్` చిత్రంలో నటించాడు.

టెలివిజన్ నంగంలోనూ శ్రీశాంత్ రాణించాడు. ఆ అనుభవంతోనే రిటైర్మెంట్ తర్వాత  నటుడిగా తెరంగేట్రం చేసాడు. అలాగే సచిన్ కూడా బాలీవుడ్ లో నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. సచిన్ కుమార్తె  పెద్ద హీరోయిన్ అవ్వాలని కలలు కంటుందని ఇటీవలే మీడియాలో ప్రచారం సాగింది.