క్రిష్-పవన్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్?

Mon Jan 27 2020 17:23:26 GMT+0530 (IST)

MM Keeravani To Compose Music For Pawan kalyan and Krish Film

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రీ-ఎంట్రీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలీవుడ్ హిట్ ఫిలిం 'పింక్' కు రీమేక్.  ఈ సినిమానే కాకుండా పవన్ మరో చిత్రానికి కూడా పచ్చజెండా ఊపారు.  క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుందని.. ఇదొక పీరియడ్ ఫిలిం అని ఇప్పటికే వార్తలు వచ్చాయి.తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.  ఈ సినిమాకు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తారట. పీరియడ్ డ్రామా కావడంతో ఈ సినిమాకు ఒక సీనియర్ సంగీత దర్శకుడు అవసరం అనే ఉద్దేశంతోనే కీరవాణికి ఓటేసినట్టు సమాచారం.  కీరవాణి ప్రస్తుతం రాజమౌళి  క్రేజీ ప్రాజెక్ట్ 'RRR' కు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.. ఇదిలా ఉంటే పవన్ - క్రిష్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.  

పవన్-క్రిష్ సినిమా త్వరలోనే లాంచ్ చేస్తారని.. వచ్చే నెలలోనే సెట్స్ పైకి తీసుకెళ్తారని అంటున్నారు.  'పింక్' రీమేక్ తో పాటే ఈ సినిమా షూటింగ్ లో కూడా పవన్ పాల్గొంటారట. పవన్ అభిమానులకు ఇంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుంది చెప్పండి.. ఫ్యాన్స్ కు పవర్ స్టార్ ఒకేసారి డబల్ ట్రీట్ ఇస్తున్నట్టే.