Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే గ్లామ‌ర్ అదుర్స్‌!!

By:  Tupaki Desk   |   25 Nov 2021 12:38 PM GMT
ఎమ్మెల్యే గ్లామ‌ర్ అదుర్స్‌!!
X
వైసీపీ నాయ‌కురాలు.. ఫైర్ బ్రాండ్‌, జ‌బ‌ర్ద‌స్త్ రోజా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దేనినైనా స‌మ‌ర్ధించుకోగ‌ల దిట్ట‌గా.. ఏవిష‌యాన్న‌యినా.. త‌న‌కు లేదా.. తన పార్టీకి అనుకూలంగా మ‌లుచుకోగ‌ల నాయ‌కురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఒక‌వైపు చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు సాధిస్తూనే.. మ‌రో వైపు.. రియాల్టీ షోల్లోనూ..త‌న దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వాస్త‌వానికి ఇద్ద‌రు బిడ్డ‌ల త‌ల్లి .. ఫైర్ బ్రాండ్ నాయకురాలు అయి ఉండి కూడా ఇప్ప‌టికీ.. గ్లామ‌ర్ కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నార‌నే అంటారు రోజా అభిమానులు.

అన్ని ర‌కాల వ‌స్త్రాల‌ను ధ‌రించ‌డం.. రోజా స్ట‌యిల్‌. అది ఇది అనే తేడా లేకుండా.. ప్రేక్ష‌కుల‌ను మెప్పించా ల‌నే ఆమె త‌ప‌న‌ను అర్ధం చేసుకోవాల్సిందే. ఓ చానెల్‌లో వ‌చ్చే జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మంలో హాట్ కామెంట్లు చేయ‌డంతోపాటు.. గ్లామ‌ర్ షోయింగ్ చేస్తున్న రోజాకు అభిమానులు బాగానే ఉన్నారు.

అయితే.. ఒక ప్రజాప్ర‌తినిధిగా ఆమె ఇలా ఇంత గ్లామ‌ర్ షో.. చేయాల్సిన అవ‌స‌రం ఉందా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టికీ అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఇక్క‌డ రాజ‌కీయంగా కూడా ఆమె తీవ్ర ఇర‌కాటంలో ఉన్నారు. గ్లామ‌ర్ ఫీల్డ్ కొత్త‌కాదు.. ఇంకా రాణించాల‌నే ఆశ తీర‌దు.. అయిన‌ప్ప‌టికీ.. ఆమె నియోజ‌క‌వ‌ర్గానికి కూడా టైం ఇవ్వాలి క‌దా! అంటున్నారు.

ప్ర‌స్తుతం రోజా.. గ్లామ‌ర్ అదుర్స్ అంటున్నారు వీక్ష‌కులు. ఆమె పాల్గొంటున్న రియాల్టీ షోల‌కు మంచి ఫాలోయింగ్ ల‌భిస్తోంది. వీక్ష‌కులు సైతం పెరుగుతున్నారు. చిలిపి మాట‌లు.. యాక్ష‌న్ సీన్‌లు.. అద‌ర‌గొడుతున్నాయ‌న‌డంలో సందేహం లేదు. అయితే.. రాజ‌కీయాల్లో ఉంటూ.. ఇలా చేయ‌డం మంచిదేనా? అంటే.. గ‌తంలో ఎంతో మంది రాజ‌కీయాల్లో ఉంటూ.. న‌టించ‌డం లేదా? .. అనే ప్ర‌శ్న వ‌స్తోంది. మొత్తానికి రోజా ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. సంచ‌ల‌న‌మే అంటున్నారు ఆమె అభిమానులు. తాజాగా రోజా ఫోజుల‌తో కూడిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డం గ‌మ‌నార్హం.