బిగ్ బాస్ బ్యాన్ చేయాల్సిందే .. ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్

Mon Nov 29 2021 11:21:27 GMT+0530 (IST)

MLA Rajasingh Fire on Bigg Boss show

బిగ్ బాస్ బిగెస్ట్ రియాలిటీ . ఈ గేమ్ షో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది. పలుదేశాల్లో పలు భాషల్లో ఈ గేమ్ షో సూపర్ సక్సెస్ గా దూసుకుపోతుంది. మన తెలుగు లో కూడా ప్రస్తుతం ఐదో సీజన్ నడుస్తుంది. అయితే బిగ్ బాస్ ఈ రియాల్టీ గేమ్ షో ఎంత అందరాని పొందిందో అంటే విమర్శలను కూడా ఎదుర్కొంటుంది. హౌస్‌లో ఉన్న హౌస్‌మేట్స్ శృతిమించుతున్నారు అంటూ ఇప్పటికే పలువురు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ గేమ్ షో వల్ల సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికే సీపీఐ నారాయణ కోర్టులోకేసు కూడా వేశారు. ఆయన ఎప్పుడు బిగ్ బాస్ గేమ్ పట్ల వ్యతిరేకతను చూపిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో బిగ్ బాస్ గేమ్ షోను బ్యాన్ చేయాలి. అసలు ఆ షోలో ఏం జరుగుతుందో అర్ధంకావడంలేదు అన్నారు రాజా సింగ్. యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యి బయటకు రావడంలో ఎదో జరిగిందని అన్నారు. రవి విషయంలో ఏం జరిగిందో బయటకు రావాలి అన్నారు.ప్రశాంతంగా ఉన్న హైద్రాబాద్ లో ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్స్ తెచ్చి రెచ్చగొడ్తున్నారని రాజా సింగ్ ఆరోపించారు.

గత రాత్రి అన్నపూర్ణ స్టూడియో దగ్గర రచ్చరచ్చ చేసారు.. అసలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ప్రజలకు ఏం మేసెజ్ లు ఇస్తున్నారు చిన్న పిల్లలు మహిళలు బిగ్ బాస్ కంటెంట్ చూడలేకపోతున్నారు అని ఆయన అన్నారు. బిగ్ బాస్ షోకి సైతం సెన్సార్ ఉండాల్సిందే. అన్నీ భాషలు ఉన్న బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలనీ కేంద్ర హోం మంత్రికి లేఖ రాస్తా హిందూ దేవుళ్లను సైతం బిగ్ బాస్ లో కించపరుస్తున్నారని రాజా సింగ్ మండి పడ్డారు.

యాంకర్ రవికి అన్యాయం జరిగిందంటూ ఆరోపిణిస్తున్నారు. అసలు ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రోడ్డు మీదకు రావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలంగాణ జాగృతి సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయన్న విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. ఓట్ల విషయంలో అవకతవకలు జరిగాయని నిరసనలు వచ్చిన సందర్భాల్లో బిగ్‌బాస్ నిర్వాహకులు స్పందించలేదు. మరి ఇప్పుడైనా ఈ వ్యవహారంపై స్పందిస్తారో లేదో చూడాలి.