Begin typing your search above and press return to search.

ఏమాత్రం వెనక్కి తగ్గని 'మా' ఎన్నికల అధికారి..!

By:  Tupaki Desk   |   18 Oct 2021 4:30 PM GMT
ఏమాత్రం వెనక్కి తగ్గని మా ఎన్నికల అధికారి..!
X
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికల వివాదంలో పోలింగ్ రోజు నాటి సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది. ఎన్నికలు ఉద్రిక్తత వాతావరణంలో జరిగాయని.. తమపై దౌర్జన్యం చేశారని.. మ్మోహన్ బాబు - నరేష్ తమ సభ్యుల పై దాడి చేశారని మంచు విష్ణు ప్యానల్ మీద ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీసీ కెమెరాలు అన్ని విషయాలను రికార్డు చేసుంటాయని తాము భావిస్తున్నామని.. సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని కోరుతున్నామని ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ లేఖ రాశారు.

అయితే 'మా' ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ మాత్రం సీసీటీవీ ఫుటేజ్ భద్రంగా ఉందని.. నిబంధనల ప్రకారం ఇస్తామని చెబుతూ వచ్చారు. 'మా' నూతన అధ్యక్షుడు మంచు విష్ణు మాత్రం సీసీ ఫుటేజ్ చేసుకోవచ్చని అన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి ఎన్నికలు జరిగిన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. అనంతరం ప్రకాశ్ రాజ్ మీడియా తో మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగిన తీరుపై సందేహాలు నివృత్తి చేసుకోవడానికి సీసీ టీవీ ఫుటేజ్ చేశామని తెలిపారు.

ఎన్నికల అధికారి వద్ద ఇంకా ఏడు కెమెరాల ఫుటేజీ ఉందని.. దానిని కూడా పరిశీలించిన తర్వాత మీడియాకు అన్ని విషయాలు వెల్లడిస్తామని ప్రకాష్ రాజ్ అన్నారు. మంచు విష్ణు పెద్ద మనసుతో సీసీ ఫుటేజీ పరిశీలించడానికి అంగీకారం తెలిపినందుకు ధన్యవాదాలు. కానీ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ తో మాకు ఇబ్బందులు ఉన్నాయి. ఫిర్యాదులపై ఆయన స్పందించడం లేదు. ఫుటేజీ ఇవ్వాలని కోరుతూ ఇటీవల ఆయనకు లేఖ రాశాను. సీసీ ఫుటేజీ ఇవ్వడం కుదరదు.. దానికంటూ ఓ ప్రోటోకాల్ ఉంటుంది అన్నారు. మాకు మంచు విష్ణు తో సమస్య లేదు.. ఉన్నదల్లా ఎన్నికల అధికారితోనే అని ప్రకాశ్ రాజ్ అన్నారు

అయితే 'మా' సీసీటీవీ ఫుటేజీ వివాదం పై ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలకు ముందు చెప్పినట్లుగానే సమాధానం ఇచ్చారు. 'మా' అసోసియేషన్ ఎన్నికలు సక్రమంగా నిర్వహించడం వరకే తన బాధ్యత అని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు ఎన్నికలు ముగిసిన తర్వాత ఏం జరిగినా తనకు సంబంధం లేదని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ కావాలంటే నిబంధనల ప్రకారం కోర్టుకు వెళ్లాలని.. కోర్టు తీర్పుకు అనుగుణంగానే తాను న‌డుచుకుంటాన‌ని కృష్ణ మోహన్ స్పష్టం చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత చెలరేగిన ఈ వివాదం ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.

ఇకపోతే 'మా' పోలింగ్ నాటి సీసీ టీవీ ఫుటేజీని కోరడం పై అధ్యక్షుడు మంచు విష్ణు సోమవారం మరోసారి స్పందించారు. గెలుపోటములు సహజమని.. వెయ్యి శాతం వాళ్ళు సిసిటీవి పుటేజ్ చూసుకోవచ్చని అన్నారు. తాము ప్రజాస్వామికంగా గెలిచామని.. అన్ని బహిరంగంగానే జరిగాయని తెలిపారు. మేము ఇద్దరమే కలిసి బ్యాలెట్ పేపర్లు సపరెట్ చేశామని.. ఫలితం వెలువడకముందే తాను గెలిచానని ప్రకాష్ రాజ్ అభినందించినట్టు చెప్పుకున్నారు. తన తండ్రి కోపం అందరికీ తెలుసని.. పోలింగ్ జరిగిన రెండు రోజుల తర్వాత దాడి చేశారని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. 'సిసిటీవీ ఫుటేజ్ లను వాళ్ళు చూసుకోవచ్చు. దానికి ఎలాంటి సమస్య లేదు. ఇబ్బంది లేకపొతే సిసి ఫుటేజ్ ని అందరికీ పంచుకోండి. మా వల్ల జూబ్లీ పబ్లిక్ స్కూల్ కు ఇబ్బంది కలిగింది. వారికి క్షమాపణ చెబుతున్నాను'' అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.