'మా' ఎన్నికలు: మంచు విష్ణు ప్యానల్ ఇదే..!

Thu Sep 23 2021 13:02:43 GMT+0530 (IST)

MAA Election This is the manchu Vishnu panel

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు అక్టోబర్ 10వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలల ముందే టాలీవుడ్ లో 'మా' ఎన్నికల వేడి మొదలయ్యగా.. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈసారి ‘మా’ అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్ రాజ్ - మంచు విష్ణు బరిలో దిగుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రకాశ్ రాజ్ తన ప్యానల్ ని ప్రకటించి.. విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో మంచు విష్ణు కూడా దూకుడు పెంచడానికి రెడీ అయ్యారు. తాజాగా విష్ణు కూడా తన ప్యానల్ ను ప్రకటించారు. ఎవరెవరు ఏ ఏ పదవుల కోసం పోటీ చేస్తున్నారనే విషయాలను వెల్లడించారు.'మా' అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న మంచు విష్ణు.. 'మా' కోసం మనందరం అనే నినాదంతో బరిలో దిగుతున్నారు. 25 మందితో కూడిన మంచు విష్ణు ప్యానల్ లో జనరల్ సెక్రటరీగా రఘుబాబు.. వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవి - పృధ్వీరాజ్ పోటీలో నిలుస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబు మోహన్ పోటీ.. ట్రెజరర్ గా శివబాలాజీ బరిలో నిలుస్తున్నారు. జాయింట్ సెక్రటరీగా కరాటే కల్యాణి - గౌతమ్ రాజు పోటీ చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా 17 మంది సినీ ప్రముఖుల పేర్లను మంచు విష్ణు ప్రకటించారు.

మంచు విష్ణు 'మా' ప్యానల్ వివరాలు..!

1. మంచు విష్ణు - అధ్యక్షుడు
2. రఘుబాబు - జనరల్ సెక్రటరీ
2. బాబు మోహన్ - ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్
4. మాదాల రవి - వైస్ ప్రెసిడెంట్
5. పృథ్వీరాజ్ బాలిరెడ్డి - వైస్ ప్రెసిడెంట్
6. శివ బాలాజీ - ట్రెజరర్
7. కరాటే కల్యాణి - జాయింట్ సెక్రటరీ
8. గౌతమ్ రాజు- జాయింట్ సెక్రటరీ

ఎగ్జిక్యూటివ్ మెంబర్లు:

1. అర్చన
2. అశోక్ కుమార్
3. గీతా సింగ్
4. హరినాథ్ బాబు
5. జయవాణి
6. మలక్ పేట్ శైలజ
7. మాణిక్
8. పూజిత
9. రాజేశ్వరీ రెడ్డి
10. రేఖ
11. సంపూర్ణేశ్ బాబు
12. శశాంక్
13. శివన్నారాయణ
14. శ్రీలక్ష్మి
15. శ్రీనివాసులు
16. స్వప్నా మాధురి
17. విష్ణు బొప్పన
18. వడ్లపట్ల