మెగా బ్రదర్స్ తో చర్చలు ఫలిస్తే లక్కీనే!

Thu Nov 25 2021 09:48:27 GMT+0530 (IST)

Lucky If Discussions With Mega Brothers End

మెగా బ్రదర్స్ చిరంజీవి.. పవన్ కల్యాణ్ లతో సినిమా చేయాలంటే ఆషామాషీనా? స్క్రిప్టు పరంగా మెప్పించాలంటేనే చాలా సమయం వేచి చూడాలి. 100శాతం బౌండ్ స్క్రిప్ట్ తో రావాలి. అనుభవ పూర్వక సలహాలు విని మార్పు చేర్పులతో తుది మెరుగులు దిద్దాలి. దీనికోసం చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఇప్పటికే పలువురు యువదర్శకులు మెగాస్టార్ కి పవన్ కి కూడా కథలు వినిపించి బౌండ్ స్క్రిప్టులు రెడీ చేస్తున్నారు. ఇందులో అనీల్ రావిపూడి పేరు కూడా క్యూలో ఉందిపరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకుల జాబితాలో అతడి పేరుంది. పరిశ్రమకు ఒక పిల్లర్ గా ఉన్న విక్టరీ వెంకటేష్ తో ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు ఎఫ్ 3 తెరకెక్కిస్తున్నాడు. అందుకే అతడికి చిరు .. పవన్ లాంటి స్టార్లు ఆఫర్లు ఇచ్చారు. అయితే బౌండ్ స్క్రిప్ట్ వినిపించి డేట్లు లాక్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అనీల్ రావిపూడి అదే ప్రయత్నంలో ఉన్నారు. అతడు తదుపరి బాలకృష్ణతో ఓ సినిమాకి సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈలోగానే చిరు.. పవన్ తో స్క్రిప్టు పరంగా చర్చలు సాగించానని తెలిపాడు.

మెగా బ్రదర్స్ తో చర్చలు జరుగుతున్నాయని అయితే ఇంకా ఏదీ కన్ఫమ్ కాలేదని రావిపూడి అన్నారు. అంతా అనుకూలిస్తే మెగా బ్రదర్స్ తో పని చేసే అవకాశం ఉందని హోప్ ఉంది. అయితే చిరు .. పవన్ ఇద్దరూ ఎవరికి వారు కెరీర్ పరంగా పూర్తి బిజీగా ఉన్నారు. చిరు ఆచార్యను రిలీజ్ చేస్తూనే గాడ్ ఫాదర్ షూటింగులో బిజీగా ఉన్నారు. తదుపరి భోళా శంకర్- వాల్టేర్ వీరయ్య చిత్రాల్లో నటించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అనీల్ కి ఓకే చెప్పే ఛాన్సుంటుంది. మారుతి కూడా ఇప్పటికే చిరు క్యూలో ఉన్న సంగతి తెలిసిందే.

పవన్ కూడా అంతే బిజీ. భీమ్లా నాయక్ చిత్రీకరణ పూర్తయ్యాక.. హరి హర వీరమల్లు చిత్రీకరణతో బిజీ అవుతున్న పవన్ మరోవైపు సురేందర్ రెడ్డి మూవీ సహా హరీష్ శంకర్ తో భవధీయుడు భగత్ సింగ్ మూవీ చేస్తారు. అలాగే పలువురు ఇతర దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ ఎప్పటికి ముందుకెళుతుంది ? అన్నది చెప్పలేం.