వాట్ ఏ లక్కీ ఛాన్స్ సుధీర్ బాబు..!

Tue Jan 24 2023 05:00:02 GMT+0530 (India Standard Time)

Lucky Chance For Sudheer Babu

ఘట్టమనేని ఫ్యామిలీ హీరో సుధీర్ బాబు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా సరైన హిట్ మాత్రం పడట్లేదు. మాస్ హీరో కటౌట్ ఉన్నా సరే ఎందుకో అతనికి లక్ కలిసి రావట్లేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా కూడా నిరాశపరచింది. ప్రస్తుతం సుధీర్ బాబు హంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో సుధీర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు.సినిమాలో శ్రీకాంత్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. చిత్ర శుక్ల హీరోయిన్ గా నటించిన ఈ హంట్ సినిమా జనవరి 26న రిలీజ్ అవుతుంది. సంక్రాంతి సినిమాల హడావిడి కొనసాగుతున్నా ఈ వీకెండ్ వస్తున్న సోలో సినిమాగా సుధీర్ బాబుకి మంచి ఛాన్స్ వచ్చింది.

ఆల్రెడీ పొంగల్ రిలీజ్ సినిమాలు చూసిన ఆడియన్స్ వీకెండ్ కి కొత్త సినిమా ఎక్స్ పీరియన్స్ చేయాలని అనుకుంటారు. అలాంటి వారికి తెలుగులో అయితే సుధీర్ బాబు హంట్ ఒక్కటే అందుబాటులో ఉంటుంది.

సుధీర్ బాబు కూడా తన ప్రతి సినిమాలో లానే హంట్ లో కూడా యాక్షన్ సీన్స్ చాలా స్పెషల్ గా ఉండేలా చూసుకున్నారు. హంట్ ట్రైలర్ కూడా ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

సుధీర్ బాబు హంట్ మూవీని భవ్య ఆర్ట్స్ క్రియేషన్స్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. గిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను మహేష్ సూరపనేని డైరెక్ట్ చేశారు. సుధీర్ బాబు సోలోగా హంట్ సినిమాతో వస్తున్నాడు. సో ఈ వీకెండ్ హంట్ కి మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు.

హీరోగా ఎన్నో విధాలుగా తన ప్రయత్నాలు చేస్తున్న సుధీర్ బాబు ఈ సినిమాతో అయినా అనుకున్న రేంజ్ హిట్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి హంట్ మంచి ఐ ఫీస్ట్ అందించేలా ఉందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. సుధీర్ బాబు కెరీర్ లో హంట్ ప్రత్యేక సినిమాగా నిలుస్తుందని అంటున్నారు. మరి సినిమా ఆ రేంజ్ ఉంటుందా లేదా అన్నది మరో 2 రోజుల్లో తెలుస్తుంది.       నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.