Begin typing your search above and press return to search.

లూసీఫర్‌ మేకర్‌ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌

By:  Tupaki Desk   |   19 Jun 2021 8:30 AM GMT
లూసీఫర్‌ మేకర్‌ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌
X
మలయాళ సూపర్‌ హిట్ మూవీ లూసీఫర్‌ ను తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్‌ పొలిటికల్ డ్రామా అయిన లూసీఫర్‌ ను తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి ఎంతో ఇష్టపడి మరీ రీమేక్‌ చేస్తున్నాడు. విభిన్నమైన నేపథ్యం కాకున్నా కూడా కథ నడిచే తీరు ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అందుకే లూసీఫర్‌ సక్సెస్‌ అయ్యింది. లూసీఫర్‌ కు పృథ్వీ రాజ్ సుకుమారన్‌ దర్శకత్వం వహించాడు. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమా ల్లో నటించిన పృథ్వీరాజ్ దర్శకుడిగా మొదటి సినిమా లూసీఫర్ తో సక్సెస్‌ ను దక్కించుకున్నాడు.

ఇప్పుడు అదే పృథ్వీరాజ్ దర్శకుడిగా రెండవ సినిమాను ప్రకటించాడు. మలయాళం సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ తోనే తన సెకండ్‌ మూవీని కూడా పృథ్వీరాజ్ తెరకెక్కించబోతున్నాడు. ఈ విషయమై ఇప్పటికే స్వయంగా పృథ్వీరాజ్‌ అధికారికంగా ప్రకటన చేశాడు. ఈ యాక్టర్ కమ్‌ డైరెక్టర్‌ రెండవ సినిమాకు 'బ్రో డాడీ' అనే టైటిల్‌ ను ఖరారు చేశాడు. టైటిల్‌ చాలా విభిన్నంగా ఉండటంతో కాన్సెప్ట్‌ కూడా తప్పకుండా విభిన్నంగా ఉంటుందనే నమ్మకంను మోహన్ లాల్‌ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

టైటిల్‌ ను బట్టి చూస్తుంటే మోహన్ లాల్‌ తో పాటు మరో హీరో కూడా సినిమా లో ఉండే అవకాశం ఉంది. పృథ్వీరాజ్‌ దర్శకత్వంలో రాబోతున్న ఈ రెండవ సినిమా కూడా సక్సెస్ అయితే ఇతర భాషల్లో రీమేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసీఫర్‌ డైరెక్టర్‌ మూవీ అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. ఇతర భాషల ప్రేక్షకులు కూడా బ్రో డాడీ గురించి చర్చించుకుంటున్నారు.