Begin typing your search above and press return to search.

ఒకప్పటి లవర్ బాయ్.. మళ్ళీ రావచ్చుగా

By:  Tupaki Desk   |   5 Dec 2022 8:30 AM GMT
ఒకప్పటి లవర్ బాయ్.. మళ్ళీ రావచ్చుగా
X
చైల్డ్ ఆర్టిస్ట్ గా కొంతమంది అగ్ర హీరోలతో కలిసి నటించిన హీరో తరుణ్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. ఇక అతను హీరోగా కెరీర్ మొదలుపెట్టిన కొత్తలోనే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు వచ్చాయి. ముఖ్యంగా నువ్వే కావాలి సినిమా అయితే అప్పట్లో చిన్న సినిమాల్లో అత్యధిక ప్రాఫిట్ అందించిన వాటిలో ఒకటిగా నిలిచింది.

అంతేకాకుండా మరికొన్ని సినిమాలు కూడా అతనికి బ్యాక్ టు బ్యాక్ మంచి బూస్ట్ ఇచ్చాయి. చూస్తుండగానే తరుణ్ లవర్ బాయ్ గా ఒక రేంజ్ కు వెళ్ళిపోయాడు. అతనితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఇంటి చుట్టూ క్యూ కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి అతను కూడా డిజాస్టర్ సినిమాలతో కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. కొంత కాలం తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పటికీ కూడా వర్కౌట్ కాలేదు.

ఇక ప్రస్తుతం అతను తన వ్యాపారాలతోనే బిజీగా ఉన్నాడు. ఇక తరుణ్ కు మధ్యలో బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చినట్లు కొన్ని వార్తలు కూడా వచ్చాయి. కానీ అందులో నిజం లేదు అని అతను క్లారిటీ ఇచ్చాడు. ఇక సోషల్ మీడియాలో తరుణ్ అప్పుడప్పుడు కాస్త చురుగ్గా కనిపిస్తున్నాడు. తన రెగ్యులర్ లైఫ్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నాడు.

రీసెంట్ గా అతను స్టైలిష్ లుక్ లో కనిపించిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇక ఆ ఫోటో చూసిన ఫ్యాన్స్ ఒకప్పటి లవర్ బాయ్ కు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అని మళ్లీ సినిమాలోకి రావచ్చుగా అని అడుగుతున్నారు. తరుణ్ కూడా మళ్లీ కెరీర్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు కానీ నేటి తరం వారికి నచ్చే విధంగా సరైన కంటెంట్ అయితే అతనికే దొరకడం లేదు.

మంచి కంటెంట్ తో మాత్రం సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఇటీవల నువ్వే నువ్వే సినిమాకు సంబంధించిన రీ రిలీజ్ లో కూడా అతను కనిపించిన విషయం తెలిసిందే. సినిమాలపై అయితే అతనికి మక్కువ ఉన్నట్లు అర్థమవుతుంది. మరి తరుణ్ కు ప్రస్తుతం సెట్ అయ్యే విధంగా ఎవరైనా కథలు రెడీ చేస్తారో లేదో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.