'పుష్ప' రిలీజ్ డేట్ కు 'లవ్ స్టోరీ'.. రెండు వారాల గ్యాప్ తో 'టక్ జగదీష్'..?

Thu Jun 17 2021 09:00:02 GMT+0530 (IST)

Love Story for Pushpa release date Tuck Jagdish with a gap of two weeks

గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతూ సాధారణ పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో ఇప్పటికే కొన్ని చిత్రాల షూటింగులు మళ్లీ మొదలైయ్యాయి. రాబోయే రెండు వారాల్లో మరికొన్ని సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. అలానే జులై 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను తెరుస్తారని ప్రచారం జరుగుతోంది. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతో థియేటర్స్ రీ ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిస్థితులను బట్టి 100 శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్స్ రావొచ్చు. ఈ నేపథ్యంలో సమ్మర్ లో వాయిదా పడిన సినిమాలు.. నైట్ కర్ఫ్యూ ఎత్తేస్తే ఆగస్ట్ నెలలో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇప్పటికే 'లవ్ స్టోరీ' సినిమా విడుదలపై నిర్మాత సునీల్ నారంగ్ క్లారిటీ ఇచ్చారు. ఏపీ తెలంగాణలలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే తమ సినిమాని థియేటర్లలో విడుదల చేస్తామని అన్నారు. థియేటర్లలో రోజుకు మూడు షో లతో సినిమా విడుదల చేయాలని అనుకోవట్లేదని.. నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే విడుదల గురించి ఆలోచిస్తామని.. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని సునీల్ నారంగ్ వెల్లడించారు. జూలై రెండో వారం తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపోతే కరోనా కారణంగా వాయిదా పడిన 'టక్ జగదీష్' చిత్రాన్ని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

'లవ్ స్టొరీ' సినిమా ఇండిపెండెన్స్ వీక్ లో 'లవ్ స్టొరీ' సినిమాని రిలీజ్ చేస్తే.. రెండు వారాల గ్యాప్ తో 'టక్ జగదీష్' ని విడుదల చేయాలని భావిస్తున్నారట. ఆగస్టు 13వ తేదీని బ్లాక్ చేసి పెట్టుకున్న ‘పుష్ప’ ఎలాగూ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ లేవు కాబట్టి.. ఆ డేట్ లో నాగచైతన్య సినిమాని తీసుకొస్తారని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో నాని చిత్రాన్ని రిలీజ్ చేసే విధంగా రెండు సినిమాల నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయట. ఇక వెంకటేష్ 'నారప్ప'.. రానా విరాటపర్వం' సినిమాలు కూడా వీటి తర్వాత ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దసరాకు బాలయ్య 'అఖండ'.. చిరంజీవి 'ఆచార్య' సినిమాలు పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.