కర్ఫ్యూలన్నీ ఎత్తేసి 4ఆటలు ఆడనిస్తేనే...!

Wed Jun 16 2021 12:01:20 GMT+0530 (IST)

Love Story Movie Release Update

సెకండ్ వేవ్ ప్రభావంతో ఇన్నాళ్లు కర్ఫ్యూలు అమల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒక పూట కర్ఫ్యూ.. నైట్ కర్ఫ్యూలు రన్ అయ్యాయి. అయితే ఇటీవల లాక్ డౌన్ పూర్తి గా ఎత్తేయడంతో 50శాతం ఆక్యుపెన్సీతో సినిమాల్ని రిలీజ్ చేసుకోవచ్చని సంకేతాలు అందాయి.కానీ రాత్రి వేళల్లో కర్ఫ్యూలు విధిస్తే వేసవి విడుదలకు సిద్ధమవుతున్న చిత్రాల సన్నివేశమేమిటి? అన్నది హాట్ టాపిక్ గా మారింది. శేఖర్ కమ్ముల- చైతన్య - సాయి పల్లవి కాంబినేషన్ మూవీ లవ్ స్టోరి.. అలాగే నాని టక్ జగదీష్ రిలీజ్ లపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

సెకండ్ వేవ్ ఆరంభంలో రిలీజ్ కావాల్సినవి.. కానీ కరోనా ఉధృతి వల్ల వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమాల్ని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహకాల్లో ఉన్నారు. అయితే రిలీజ్ తేదీలపైనే క్లారిటీ రాలేదు.

లవ్ స్టోరీ నిర్మాతలలో ఒకరైన సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే లవ్ స్టోరీ థియేటర్లలో విడుదలవుతుందని తెలిపారు. మూడు ఆటలతో రన్ చేయలేం. నాలుగో ఆట కూడా ఉండాలి. నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే ఇది సాధ్యం. అప్పుడే రిలీజ్ గురించి ఆలోచిస్తాం. జూలై రెండవ వారం తర్వాతే సాధారణ స్థితి వస్తుందని నా అభిప్రాయం. ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించి సరైన సమయంలో అధికారిక ప్రకటనతో వస్తాం``అని అన్నారు.

నాని టక్ జగదీష్ పైనా నిర్మాతలు ఇంచుమించు ఇలాంటి ప్రణాళికతోనే ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక రానా అరణ్యపర్వం రిలీజ్ తేదీ గురించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.