Begin typing your search above and press return to search.

BB4 : అఖిల్‌ ను బాగా వాడేస్తున్నారుగా

By:  Tupaki Desk   |   17 Sep 2020 5:00 AM GMT
BB4 : అఖిల్‌ ను బాగా వాడేస్తున్నారుగా
X
తెలుగు బిగ్‌ బాస్‌ ప్రతి సీజన్‌ లో కూడా లవ్‌ ట్రాక్‌ నడపడం చాలా కామన్‌ అయ్యింది. గత సీజన్ లో రాహుల్‌, పున్నుల లవ్‌ ట్రాక్‌ వల్ల అనూహ్యంగా షో కు టీఆర్పీ రేటింగ్‌ దక్కింది. రాహుల్‌ విన్నర్‌ అవ్వడంకు కారణం కూడా పున్నుతో పులిహోరా అనే విషయం తెల్సిందే. అందుకే ఈసారి కూడా పులిహోరా రాజాలను రంగంలోకి దించారు. షోలో ఉన్న పరిస్థితి చూస్తుంటే మొత్తం ముందుగానే స్క్రిప్ట్‌ తయారు చేసినట్లుగా అనిపిస్తుంది. హీరోయిన్‌ మోనాల్‌ గజ్జర్‌ ను రంగంలోకి దించడం వల్ల షో లో ఉన్న వారిని ఆకర్షించేందుకు అవకాశం దక్కింది. ఒక వైపు అభిజిత్‌ మరో వైపు అఖిల్‌ లు ఆమె అంటే ఆసక్తి చూపుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇదే సమయంలో వారిద్దరు కూల్‌ గా ఆమెకు దగ్గర అవుతున్నారు. ప్రేక్షకులు ముఖ్యంగా అఖిల్‌ పై ఫోకస్‌ పెడుతున్నారు. అతడి అటిట్యూడ్‌ అందరికి నచ్చుతుంది. ముఖ్యంగా మోనాల్‌ విషయంలో అతడు చూపించే లవ్‌ పై అందరికి మక్కువ ఏర్పడింది.

షో నిర్వాహకులు కూడా మోనాల్‌ మరియు అఖిల్‌ ను కలిపి ఎక్కువగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్‌ లో మోనాల్‌ మరియు సోహెల్‌ కలిసి డాన్స్‌ చేసినప్పుడు అంతకు ముందు ప్రాక్టీస్‌ చేసినప్పుడు అతడు కాస్త ఈగో ఫీల్‌ అయినట్లుగా అనిపించింది. అది మరీ మరీ షో లో చూపిండచం వల్ల ప్రేక్షకులు అతడి ఫీలింగ్స్‌ అర్థం చేసుకునేలా చేశారు. ఇదే సమయంలో మోనాల్‌ కూడా అతడికి దగ్గరగా ఉంటున్న కారణంగా ఇద్దరి మద్య వ్యవహారం జెట్‌ స్పీడ్‌ తో కాకున్నా ఒక మోస్తరుగా దూసుకు పోతుంది అనిపిస్తుంది.

ముందు ముందు ఈ విషయాలు అన్ని కూడా మరింత దూరం వెళ్తే అప్పుడు షో మరింత రక్తి కట్టే అవకాశం ఉంది. అఖిల్‌ ను బిగ్‌ బాస్‌ బాగా వాడేస్తున్నాడు. అతడికి ముందుగానే స్క్రిప్ట్‌ ఇచ్చారో లేదంటే అతడే గత సీజన్‌ లను చూసి ఇన్సిపైర్‌ అయ్యాడో లేదంటే నిజంగానే మోనాల్‌ అంటే ఆసక్తి చూపిస్తున్నాడో కాని షో నిర్వాహకులకు మాత్రం ఫుల్‌ స్టఫ్‌ లభిస్తోంది. మద్యలో అభిజిత్‌ కూడా ఎంటర్‌ అవ్వడం ఇది మరింత ఆసక్తిగా సాగుతోంది. ఒక్క రాధా ఇద్దరు కృష్ణుల రేంజ్‌ లో ఈ ముగ్గురిని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.