Begin typing your search above and press return to search.

ప్రేమికుల రోజు సందర్బంగా...!

By:  Tupaki Desk   |   13 Feb 2020 7:00 AM GMT
ప్రేమికుల రోజు సందర్బంగా...!
X
వాలెంటైన్స్‌ డే సందర్బంగా టాలీవుడ్‌ లో ఓ రేంజ్‌ లో సందడి కనిపించబోతుంది. రేపు ప్రేమికుల రోజు సందర్బంగా విజయ్‌ దేవరకొండ నటించిన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ చిత్రంతో పాటు సర్వర్‌ సుందరం మరియు ఒక చిన్న విరామం అనే చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సినిమాలు మాత్రమే కాకుండా రేపు పలు సినిమాలకు సంబంధించిన పాటలు మరియు ఫస్ట్‌ లుక్‌ లు మేకింగ్‌ వీడియోలు.. థీమ్‌ మ్యూజిక్‌ లు రాబోతున్నాయి.

ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘లవ్‌ స్టోరీ’ సర్‌ ప్రైజ్‌ వీడియో. శేఖర్‌ కమ్ముల కాస్త గ్యాప్‌ తీసుకుని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌ గా తెరకెక్కించిన లవ్‌ స్టోరీ చిత్రంకు సంబంధించిన సర్‌ ప్రైజ్‌ ను రేపు రివీల్‌ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక ప్రేమికుల రోజు సందర్బంగా సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమా నుండి సింగిల్స్‌ గురించి ఒక పాటను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే సాయి ధరమ్‌ తేజ్‌ ప్రకటించాడు.

రేపు నితిన్‌ భీష్మ నుండి కూడా సింగిల్స్‌ కు సంబంధించిన ఒక పాటను విడుదల చేయబోతున్నట్లు గా చెబుతున్నారు. ఇప్పటికే ఆ పాటకు సంబంధించిన స్టిల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇక సందీప్‌ కిషన్‌ ఏ1 ఎక్స్‌ ప్రెస్‌ సినిమాకు సంబంధించి కూడా ఒక పాటను విడుదల చేయబోతున్నారు. మొత్తానికి రేపు ప్రేమికుల రోజును తెలుగు ప్రేక్షకులు వీటితో తెగ ఎంజాయ్‌ చేయవచ్చు అన్నమాట.