Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్: స‌్టార్ డాట‌ర్ హ‌ద్దు మీరి రెచ్చిపోయిందే

By:  Tupaki Desk   |   17 Jan 2020 12:33 PM GMT
ట్రైల‌ర్ టాక్: స‌్టార్ డాట‌ర్ హ‌ద్దు మీరి రెచ్చిపోయిందే
X
సైఫ్ అలీఖాన్- దీపికా ప‌దుకొనే జంట‌గా ఇంతియాజ్ అలీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ల‌వ్ ఆజ్ క‌ల్ అప్ప‌ట్లో ఎంత‌టి సంచ‌ల‌న సృష్టించిందో తెలిసిందే. రొమాంటిక్ ల‌వ్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఈ సినిమా ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది. సైఫ్-దీపికా మ‌ధ్య రొమాంటిక్ సన్నివేశాల్లో అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. సైఫ్ డ్యూయ‌ల్ రోల్....దీపికా ఎన‌ర్జిటిక్ పర్ఫామెన్స్ ఆ సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లాయి. దాదాపు ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత ల‌వ్ ఆజ్ క‌ల్ సీక్వెల్ ని ఇంతియాజ్ తెర‌కెక్కిస్తున్నారు.

ఇందులో కార్తిక్ ఆర్య‌న్- సారా అలీఖాన్ జంట‌గా న‌టిస్తున్నారు. అప్ప‌ట్లో సైఫ్ పోషించిన పాత్ర‌ని కార్తీక్ ఆర్య‌న్ పోషిస్తుండ‌గా.. ఇందులో సైఫ్ డాట‌ర్ సంథింగ్ హాట్ రోల్ లో న‌టించ‌డం ఆస‌క్తిక‌రం. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ఇంతియాజ్ త‌న‌దైన‌ మార్క్ సినిమాని తెర‌కెక్కిస్తున్నార‌ని తాజాగా రిలీజైన‌ ట్రైల‌ర్ చెబుతోంది. రొమాంటిక్ కామెడీని ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా మ‌లిచాడు. సారా-కార్తీక్ మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాల‌తో పాటు కావాల్సినంత ఫ‌న్ ని ట్రైల‌ర్ లో జొప్పించారు.

పెద‌వి ముద్దుల్లో ఎలాంటి భేష‌జం లేకుండా సైఫ్ డాట‌ర్ హాట్ హాట్ గా న‌టించేసింది. హీరో పాత్ర‌క‌న్నా హీరోయిన్ పాత్ర ను ఎక్కువ‌గా హైలైట్ చేసారు. సారా డామినేటింగ్ రోల్ కు ప‌ర్ పెక్ట్ గా యాప్ట్ అయింది. కార్తిక్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీకి కొద‌వ‌లేద‌ని ట్రైల‌ర్ చెబుతోంది. ప్ర‌స్తుతం ఈ సీక్వెల్ ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. ల‌వ్ ఆజ్ క‌ల్-2 స‌క్సెస్ కు ద‌గ్గ‌ర‌గా ఉంద‌న్న కామెంట్లు ప‌డుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రేమికులు దినోత్స‌వం సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న రిలీజ్ చేయ‌నున్నారు.