Begin typing your search above and press return to search.

ట్రెండీ స్టోరి: మూడు ఇండ‌స్ట్రీల్లో 6 వేల‌ కోట్ల‌ న‌ష్టం

By:  Tupaki Desk   |   18 May 2021 9:30 AM GMT
ట్రెండీ స్టోరి: మూడు ఇండ‌స్ట్రీల్లో 6 వేల‌ కోట్ల‌ న‌ష్టం
X
కొన‌సాగుతున్న క్రైసిస్ నేప‌థ్యంలో భార‌త‌దేశంలో అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన మూడు సినీప‌రిశ్ర‌మ‌ల న‌ష్టం సుమారు 6000 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా. టాలీవుడ్ -1000 కోట్లు.. కోలీవుడ్ -1000 కోట్లు.. బాలీవుడ్ -4000 కోట్ల మేర 2021లో ఈ సెకండ్ వేవ్ వ‌ల్ల న‌ష్ట‌పోవాల్సిన పరిస్థితి ఉంటుంద‌ని ట్రేడ్ నిపుణుల అంచ‌నా.

ముఖ్యంగా ఎన్న‌డూ లేని విధంగా 2021 స‌మ్మ‌ర్ నాటికి టాలీవుడ్ లో వ‌రుస‌గా ప‌లు క్రేజీ చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉండ‌గా అవ‌న్నీ వాయిదాలు ప‌డ్డాయి. మెగాస్టార్ చిరంజీవి- రామ్ చ‌ర‌ణ్ - తార‌క్- ప్ర‌భాస్- మ‌హేష్- ప‌వ‌న్ క‌ల్యాణ్ వంటి అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండగా.. వీటి షూటింగులు అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వ్వడం ఆర్థికంగా తీవ్ర న‌ష్టాల్ని క‌ల‌గ‌జేసే అంశంగా భావిస్తున్నారు. ప‌లువురు మిడ్ రేంజ్ హీరోల సినిమాలు భారీ అంచ‌నాలు ఉన్నా రిలీజ్ ఆగిపోవ‌డం తీర‌ని న‌ష్టానికి దారి తీస్తోంద‌ని అంచ‌నా.

2021 జ‌న‌వ‌రి-ఫిబ్ర‌వ‌రి లో టాలీవుడ్ కోలుకున్నా కానీ.. ఆ త‌ర్వాత అనూహ్యంగా సెకండ్ వేవ్ విల‌యం టాలీవుడ్ ని పెద్ద దెబ్బ కొట్టింది. ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాకి.. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు లాంటి భారీ చిత్రానికి ఆచార్య‌-పుష్ప‌-స‌ర్కార్ వారి పాట వంటి భారీ చిత్రాల‌కు ఇది పెద్ద ప్రాబ్లెమాటిక్ గా మారింది. నిర్మాత‌లు భారీగా పెట్టుబ‌డులు వెచ్చించాక స‌రిగా మార్కెట్ చేయ‌క‌పోయినా.. రిలీజ్ ఆల‌స్య‌మైనా ఆ ప్ర‌భావం అంతా ఇంతా కాదు. ప్ర‌స్తుతం టాలీవుడ్ ప‌రిస్థితి అయోమ‌యంగా ఉంద‌ని విశ్లేషిస్తున్నారు.

టాలీవుడ్ కోలీవుడ్ లో షూటింగులు ఇప్ప‌టికే బంద్ అయ్యాయి. కోలీవుడ్‌ అగ్రహీరోలు రజనీ కాంత్‌ నటిస్తున్న అన్నాథే.. అజిత్‌ నటిస్తున్న వలిమై.. విజయ్‌- చియాన్‌ విక్రమ్‌- కమల్‌హాసన్‌- సూర్య- విజయ్‌ సేతుపతి- ధనుష్‌- శివకార్తికేయన్‌- విశాల్ వంటి ప్రముఖ హీరోల సినిమాల షూటింగుల‌కు ఇబ్బందులేర్ప‌డ్డాయి. వీరి చిత్రాల రిలీజ్ లు ఆగిపోయాయి. కోలీవుడ్ కి ఈ సీజ‌న్ లో దాదాపు 1000 కోట్లు న‌ష్టం త‌ప్ప‌ద‌ని అంచ‌నా. త‌మిళ‌నాడు వ్య‌ప్తంగా బంద్ వాతావ‌ర‌ణం ఉంది. సినిమాలు టీవీ షూటింగుల‌కు కూడా అనుమ‌తుల్లేవ్. సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కానీ..సీఎం స్టాలిన్ కానీ ఇప్ప‌ట్లో షూటింగుల‌కు అనుమ‌తించేందుకు అస్స‌లు అంగీక‌రించ‌డం లేదు.

మ‌రోవైపు బాలీవుడ్ లో డేర్ చేసి రిలీజ్ చేసిన రాధే: యువ‌ర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ ఆశించిన విజ‌యం అందుకోలేదు. సల్మాన్ -ప్ర‌భుదేవా కాంబినేష‌న్ మూవీ ఈద్ కానుక‌గా రిలీజైనా ప్రభావం చూప‌లేదు. అలాగే సూర్య‌వంశీ లాంటి భారీ చిత్రం రిలీజ్ వాయిదా ప‌డింది. అగ్ర హీరోల సినిమాల‌న్నీ షూటింగు ద‌శ‌లోనే ఉన్నాయి. అందువ‌ల్ల బాలీవుడ్ లో తెరిచి ఉంచిన థియేట‌ర్ల‌కు కూడా కంటెంట్ లేదు. కార‌ణం ఏదైనా అక్క‌డ 4000 కోట్ల మేర న‌ష్టం ఉంటుంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది.